JAISW News Telugu

Samantha : విడాకులు తీసుకున్నా.. ఆ పనిచేయనిదే నిద్రపట్టదు: సమంత

Samantha

Samantha

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కు ఉండదేమే. ఆమె ఒక్క మాట మాట్లాడినా, చిన్న ఫొటో వదలినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. ఈమెకు సంబంధించిన చిన్న వార్త అయినా సరే వైరల్ అవుతుంటుంది. తాజాగా సమంతకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది..

విడాకుల తర్వాత సామ్ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయట. ముఖ్యంగా మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత ఆమె తన లైఫ్ ను మరింతగా ప్లాన్ చేసుకుంటోంది. ఆరోగ్యం విషయంలో చాలా కేరింగ్ గా ఉంటోంది. ఫిట్ నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటోంది. సామ్ తప్పనిసరిగా 14 గంటలకు పైగానే వర్క్అవుట్స్ చేస్తుందట. విడాకులై బాధలో ఉన్నా తప్పనిసరిగా వర్క్ చేసేదట. ఇప్పటికీ ఈ అమ్మడికి వర్క్ అవుట్ చేయనిదే నిద్ర పట్టదట. ప్రస్తుతం ఇదే న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

నాగచైతన్యను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సమంత..కొన్ని సంవత్సరాల పాటు హీరోయిన్ గా స్టార్ డమ్ ను ఎంజాయ్ చేయడమే కాదు పర్సనల్ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో వ్యవహారం విడాకుల దాక వెళ్లింది. తర్వాత సమంత ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. విడాకుల బాధలో ఉండగానే మయోసైటిస్ అనే కండరాల జబ్బు వచ్చి నరకయాతన అనుభవించింది. విడాకులు, వ్యాధి బాధలతో  పాటు ఇటు వరుసగా సినిమాలు ప్లాప్ కావడంతో సమంత చాలా సమస్యలను ఎదుర్కొంది. తాజాగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఇప్పుడు కోలుకుని మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది.

Exit mobile version