90s Web Series : ’90s’ వెబ్ సిరీస్ వల్ల ఈటీవీ విన్ యాప్ కి ఎంత మంది కొత్త యూజర్లు వచ్చారో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

90s Web Series

90s Web Series

90s Web Series : హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరుని సంపాదించుకున్న శివాజీ కి బిగ్ బాస్ రియాలిటీ షో ఇచ్చిన క్రేజ్, ఫేమ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ శివాజీని ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో బాగా దగ్గర చేసింది. అందరూ ఆయన్ని శివన్న అని పిలుస్తున్నారు ఇప్పుడు. ఇకపోతే బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత ఆయన ’90s’ అనే వెబ్ సిరీస్ చెయ్యాల్సి వచ్చింది.

ఈ వెబ్ సిరీస్ ని కేవలం 40 రోజుల్లో పూర్తి చేసారు. ఇందులో శివాజీ పాత్ర కి సంబంధించి కేవలం 17 రోజులు మాత్రమే షూటింగ్ జరిగింది. ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఈటీవీ విన్ యాప్ వారు కూడా ఈ సిరీస్ ని శివాజీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాతే స్ట్రీమింగ్ చేద్దాం అనుకున్నారు.

ఎందుకంటే బిగ్ బాస్ ఫేమ్ తో శివాజీ బయటకి వచ్చిన తర్వాత ఈ సిరీస్ ని విడుదల చేస్తే మంచి రీచ్ ఉంటుంది అనుకున్నారు. బిగ్ బాస్ ద్వారా శివాజీ ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్, ఫాలోయింగ్ ని సంపాదించాడు. దానిని సరిగ్గా ఉపయోగించుకొని ఈ సిరీస్ ని ఈటీవీ విన్ యాప్ లో విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఈటీవీ విన్ యాప్ ని ప్రారంభించిన తర్వాత ఎన్నో వెబ్ సిరీస్ లు వచ్చాయి, ఎన్నో సినిమాలు అప్లోడ్ అయ్యాయి. కానీ ఒక్క దానికి కూడా అనుకున్న రేంజ్ లో వ్యూస్ రాలేదు. కానీ ’90s’ వెబ్ సిరీస్ మాత్రం ఈటీవీ విన్ యాప్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టిందట.

రీసెంట్ గా జరిగిన ఈ సిరీస్ సక్సెస్ మీట్ లో శివాజీ ఈ విషయం చెప్పుకొచ్చాడు. కేవలం ఈ వెబ్ సిరీస్ కారణంగా ఈ యాప్ కి దాదాపుగా 5 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్లు వచ్చారట. ఇది మామూలు విషయం కాదు, అంతే కాదు అప్లోడ్ చేసిన అతి తక్కువ సమయం లోనే ఈ సిరీస్ కి వంద మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయట. ఇది ఈటీవీ విన్ యాప్ లో ఒక రికార్డు గా చెప్తున్నారు. రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డ్స్ ని ఈ సిరీస్ నెలకొల్పుతుందో చూడాలి.

TAGS