Etala Rajender : చెయ్యందుకోనున్న ఈటల.. ఆ ఫొటోలు లీక్.. అసలేం జరిగింది!

Etala Rajender

Etala Rajender

Etala Rajender : ఈటల రాజేందర్ ఉద్యమ కారుడిగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా కేసీఆర్ కు కుడి భుజంగా మెదిలారు. కానీ ఆతర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ తో టీఆర్ఎస్ ను  వదలాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇక ఆ తర్వాత బీజేపీలో చేరి టాప్ త్రి నేతగా ఉన్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి రేసులో ఈటలనే ముందంజలో ఉన్నారు. ఆయన కూడా అందుకు సిద్ధంగానే గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ ను ఓడించి..తన సీఎం అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుందామనుకున్నారు. కానీ గజ్వేల్ లో కేసీఆర్ తో , తన సొంత నియోజకవర్గం హూజూరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోవడం..ఆయన్ను విపరీతంగా షాక్ కు గురిచేసింది. హూజురాబాద్ లో ‘తాను ఎంత చెప్తే అంతా..’ అనే స్థాయి నుంచి దారుణంగా ఓడిపోవడం ఆయన్ను తీవ్రంగా బాధించింది. అయితే గతంలో ఉన్న సానుభూతి లేకపోవడం, సుదీర్ఘ కాలం అక్కడ ప్రజాప్రతినిధిగా ఉండడం.. వంటి వివిధ కారణాల వల్ల ఆయన ఓడిపోయారు.

ఇక అప్పట్నుంచి ఆయన మౌనంగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. ఈక్రమంలో బీజేపీ నేతలకు షాక్ ఇచ్చే ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఓ ప్రైవేట్ సమావేశంలో పాల్గొన్నారు.

వీరి భేటీ ఫొటోలు బయటకు రావడంతో ఈటల కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ లో చేరిక ఖరారైతే.. కరీంనగర్ నుంచి ఎంపీగా బరిలో ఉండాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మొగ్గు ఉండే చాన్స్ ఉండడంతో ఈటల ఆ వైపు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈటల పొలిటికల్ సర్కిల్స్ లో ఉండాలంటే కచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. లేకపోతే మరో ఐదేండ్ల దాక ఖాళీగా ఉండాల్సి వస్తే ఆయన రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందే. అందుకే ఆయన కచ్చితంగా ఎంపీ బరిలో ఉండి గెలవాల్సిందేనని భావిస్తున్నారు. బీజేపీలో ఉంటే కరీంనగర్ నుంచి సీటు రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉంటారు. కాబట్టి ఈటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చాన్స్ ఇవ్వరు. ఇక బీజేపీ నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి ట్రై చేద్దామనుకుంటే ఎలాంటి సానుభూతి పవనాలు వీచే పరిస్థితిలేదు.

అక్కడ అంతా కొత్త కాబట్టి గెలవడం కష్టం. ఇక కరీంనగర్ అయితేనే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుపు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకే హూజూరాబాద్ వస్తుంది. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా మంచి స్టెప్ అని రాజేందర్ భావిస్తున్నారని అంటున్నారు. బీజేపీ లో చాన్స్ లేదు.. బీఆర్ఎస్ కు వెళ్లలేరు..ఇక మిగిలింది కాంగ్రెస్సే.. దీనికి తోడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అందుకే హస్తం గూటిని చేరేందుకు ఈటల ప్రయత్నిస్తున్నట్టు ఇప్పుడే కాదు గతంలోనూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలు వైరల్ అవుతుండగా.. ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై ఆయన ముఖ్య అనుచరులు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. తడవకో పార్టీ మారే వ్యక్తిత్వం ఈటల రాజేందర్ ది కాదని అంటున్నారు. బీజేపీలోనే ఆయన కొనసాగుతారని స్పష్టం చేస్తున్నారు. మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ఈటల కలిశారని, దీంట్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెబుతున్నారు.

TAGS