Pawan Kalyan : ఇంటి నుంచే ప్లాస్టిక్ నిర్మూలన ప్రారంభం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్లాస్టిక్ నిర్మూలన తప్పనిసరి అని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. అటవీ శాఖ ఏర్పాటు చేసి ప్రదర్శనశాలలను ప్రారంభించి ఆసక్తిగా తిలకించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మెరైన్ ఫానా యాప్ ను పవన్ ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు.
వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు పవన్ కల్యాణ్ బహుమతులు అందజేశారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ ని నిర్మూలించాలన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.