Epic Tension : ఎపిక్‌ టెన్షన్‌..ప్రింటింగ్‌లో నెలకొన్న జాప్యం..

Epic Tension

Epic Tension

Epic Tension : ఓటరు కార్డుల కోసం జిల్లా యంత్రాంగం ఎదురు చూస్తోంది. ప్రింటింగ్‌లో నెలకొన్న జాప్యం కార ణం గా, ఓటర్లకు ఎపిక్‌ కార్డులను పూర్తిగా పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ సమస్య నెలకొంది. మరో రెండు వారాల్లో ఎన్నికల నోటి ఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎపిక్‌ కార్డుల కోసం ఓటర్ల నుంచి బీఎల్వోలపై ఒత్తిడి ప్రారంభ మైంది.

కొత్తగా ఎపిక్‌ కార్డుల జారీకి సంబంధించి చూస్తే.. ఇంకా 4,00,516 ఎపిక్‌ కార్డుల ముద్రణ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు చూస్తే 3,97,166 ఎపిక్‌ కార్డులే జనరేట్‌ చేశారు. వీటిలో 2,14,616 కార్డు లను ప్రింటింగ్‌ కోసం పంపారు. ఈ కార్డుల వరకు ముద్రణ పూర్తయింది. ఇంకా 1,86,784 కార్డులు ముద్రణ కాలేదు. ఈ కార్డులన్నీ ముద్రణ అయితే కానీ, పూర్తిస్థాయిలో నూతన ఎపిక్‌ కార్డుల పంపి ణీ ప్రక్రియ పూర్తికాదు.

నియోజకవర్గాల వారీగా చూస్తే.. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 25,526 ఎపిక్‌ కార్డులే ప్రింటింగ్‌ అయ్యాయి. విజయవాడ పశ్చిమకు సంబంధించి 31,114 ఎపిక్‌ కార్డులు, విజయవాడ సెంట్రల్‌కు 33,047, విజయవాడ తూర్పుకు 57,372, మైలవరంకు 21,547, నంది గామకు 22,705, జగ్గయ్యపేటకు 23,335 ఎపిక్‌ కార్డులు మాత్రమే ముద్రితమయ్యాయి. పెండింగ్‌ ఎపిక్‌ కార్డుల విషయానికొస్తే తిరు వూరు లో 8,539 కార్డులు ఇంకా ప్రింటింగ్‌ కాలేదు.

TAGS