Blackmailing : రోజురోజుకూ సమాజం ఎటు వైపునకు వెళ్తుందో అర్థం కావడం లేదు. నిన్న మొన్నటి వరకు మహిళలను పురుషులు బ్లాక్ మెయిల్ చేసేవారు. కానీ ట్రెండ్ మారింది నేటి కాలంలో మహిళలే పురుషులను బ్లాక్ మెయిల్ చేసే రోజులు వచ్చాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుని తనతో ఇంతకాలం ఎంజాయ్ చేసి ఇప్పుడు తనపై తప్పుడు అత్యాచారం కేసు నమోదు చేస్తుందేమో అన్న భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఘజియాబాద్ జిల్లాలో యువకుడిని బెదిరించి అతనితో బలవంతంగా అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ మహిళ. తర్వాత ఆమె మరో మగాడితో కలిసి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆ యువకుడు భయపడిపోయాడు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో పాటు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. యువకుడి ఆత్మహత్యపై మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగం కింద ఓ మహిళ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ కు చెందిన సలీం అతని మొబైల్‌లో రెండు సెల్ఫీ వీడియోలు తీసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోలో తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాన్ని సలీం వివరించాడు. నేను మూడు రోజులు అడవిలో ఉన్నాను. ఇక నేను అడవిలో తిరుగుతూ తప్పించుకుని పారిపోలేను. నాకు అంత ఓపిక కూడా లేదు. దీంతో చనిపోవాలని నిర్ణయానికి వచ్చాను. అంటూ సెల్పీ వీడియోలో సలీం వాపోయాడు.
సెల్ఫీ వీడియోలో సలీం రియల్ ఎస్టేట్ డీలర్ అస్లాం లియాఖత్, తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ నన్ను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారని, ఆ మహిళ, ఆమె తల్లి రాత్రి నాకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారని, భయంతో ఊరు విడిచి అడవికి పారిపోయానని, పరుగు పరుగున చాలా దూరం వచ్చానని, ఇంక నేను పరిగెత్తలేనని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సలీం ఆ వీడియోలో ఆరోపించాడు.