Euro Cup : యూరో కప్ ఫైనల్లోకి ఇంగ్లండ్.. చివరి నిమిషంలో గోల్.. మ్యాచ్ టర్నింగ్ ఇక్కడే
Euro Cup : యూరో కప్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. 2024 యూరో కప్ ఫైనల్లోకి ఇంగ్లండ్ అడుగుపెట్టింది. నెదర్లాండ్స్ తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ తీవ్ర ఉత్కంఠ మధ్య రెండు గోల్స్ కొట్టి ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఫైనల్ చేరడంతో ఇంగ్లండ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మొదటి పది నిమిషాల్లో నెదర్లాండ్స్ జట్టు గోల్ చేసి ఇంగ్లండ్ ను ఆత్మ రక్షణలో పడేసింది. ఏడో నిమిషంలో నెదర్లాండ్ ప్లేయర్ మిడ్ ఫీల్డర్ సైమన్స్ గోల్ చేసి నెదర్లాండ్స్ ను ఆధిక్యంలో నిలిపాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యరీకేన్ ఫెనాల్టీని సద్వినియోగం చేసుకుని గోల్ చేశారు. దీంతో ఫస్ట్ హాప్ ముగిసే సరికి చెరో గోల్ తో సమానంగా నిలిచాయి. రెండో హాఫ్ లో రెండు జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. డచ్ తరఫున డోనియేల్ అనే ప్లేయర్ ను సబ్ ట్యూట్ గా తీసుకున్నారు. దీంతో లాస్ట్ చివరి 20 నిమిషాల సమయంలో ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది.
చివర్లో ఏకంగా హ్యరీకేన్, పోల్ సడెన్ లు బయటకు వెళ్లారు. వీరి స్థానంలో వచ్చిన ఓల్లీ వాట్కిన్స్, కోల్ పైమర్ ఇద్దరు గ్రౌండ్ లోకి వచ్చారు. అయితే మ్యాచ్ ఎక్స్ ట్రా టైంకు బయలు దేరుతున్న సమయంలో ఆఖరి 90 వ నిమిషంలో వాట్కిన్సన్ అనే ప్లేయర్ గోల్ చేసి ఇంగ్లండ్ ను ఫైనల్ చేర్చారు.
దీంతో జులై 15 న జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లండ్ దూసుకెళ్లింది. స్పెయిన్ అల్రడీ ఫైనల్ కు వెళ్లగా.. ఇంగ్లండ్ రెండో జట్టుగా ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్ గత సాకర్ ప్రపంచ కప్ లో సెమీస్ లో ఓడిపోగా.. ఈ సారి ఫైనల్ చేరింది. చాలా ఏండ్లుగా ఫుట్ బాల్ లో టైటిల్ గెలవని ఇంగ్లీష్ టీం ఈసారి ఎలాగైనా యూరో చాంపియన్స్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు.