ఇప్పటివరకు ఇంగ్లాండ్ క్రికెటర్లలో డబల్ సెంచరీలు చేసిన వ్యక్తుల్లో రూట్ రెండో స్థానంలో నిలిచాడు. సచిన్ టెండుల్కర్ సైతం టెస్టు చరిత్రలో 6 డబుల్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం జో రూట్ కూడా ఆరు డబల్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్రూక్ హైలెట్ గా నిలిచాడు. 27 ఫోర్లు మూడు సిక్స్ లతో త్రిబుల్ సెంచరీ సాధించడం గమనార్హం.
దీంతో ఇంగ్లాండ్ గత చాలా రోజుల నుంచి ఉన్న రికార్డులను చెరిపేసింది. టెస్ట్ క్రికెట్లో 800 పైగా పరుగులు చేసి రికార్డులు తిరగ రాసింది. 823 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 556 పరుగులకు అవుట్ అవ్వగా ప్రస్తుతం ఇంగ్లాండ్ 823 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కాగా ఇంగ్లాండ్ ప్లేయర్లలో హ్యారి బ్రూక్ 317 పరుగులు, జో రూట్ 262 పరుగులు చేసి 454 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక భాగస్వామ్యం వీరిది కావడం విశేషం. జో రూట్ కూడా త్రిబుల్ సెంచరీ వైపు సాగుతుండగా 262 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బ్రూక్ మాత్రం 317 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. 25 ఏళ్ల వయసులోనే త్రిబుల్ సెంచరీ చేయడం విశేషం. అంతకుముందు ఇదే స్టేడియంలో ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ 300 పరుగులు చేసి తన సత్తా నిరూపించుకున్నాడు.