India Vs England : ఇంగ్లండ్ ఆలౌట్.. ఇక మన సత్తా చూపించాల్సిందే?
India Vs England : టీమిండియా ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇండియా, ఇంగ్లండ్ పోరాడుతున్నాయి. మొదటి టెస్ట్ లో ఇండియా, ఇంగ్లండ్ ఈ మేరకు తమ ఆటను కొనసాగిస్తున్నాయి. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 420 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ 230 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
పోప్ 196 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీకి చేరువ అవుతున్న క్రమంలో 196 వద్ద ఔటయ్యాడు. డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. త్రుటిలో డబుల్ సెంచరీ కోల్పోవడంతో నిరాశకు గురయ్యాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, జడేజా 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. భారత్ ఈ టెస్టుల గెలవాలంటే 231 పరుగులు చేయాల్సి ఉంటుంది.
ఆట ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. ఈ సమయంలో ఆ టార్గెట్ చేరుకోవాలి. లేదంటే ఓటమి తప్పదు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. స్వదేశంలో జరుగుతున్న టెస్టులు కావడంతో మనం గెలిస్తేనే మర్యాదగా ఉంటుంది. మ్యాచ్ వారికి అప్పగిస్తే దారుణంగా మారుతుంది. అందుకే మన ఆటగాళ్లు చెమటోడ్చాలి.
దీంతో మొదటి టెస్టులో మనం గెలవాల్సిందే. ఐదు టెస్టుల సిరీస్ లో మనదే పైచేయి కావాలంటే మనకు విజయం తప్పనిసరి. మన పిచ్ ల గురించి మనకే అవగాహన ఉంటుంది. అందుకే మనం గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ప్లేయర్లను కట్టడి చేసి విజయం దక్కించుకోవాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడని గ్రహించాలి.