Johnny Master : ముగిసిన జానీ మాస్టర్ పోలీసు కస్టడీ

Johnny Master
Johnny Master : లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ శనివారం ముగిసింది. అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. జానీ మాస్టర్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. జానీ మాస్టర్ ను బుధవారం నుంచి శనివారం వరకు నార్సింగి పోలీసులు విచారించారు.
ఈరోజు (శనివారం) విచారణ ముగిసిన అనంతరం జానీ మాస్టర్ ను పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలంచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు అక్టోబరు 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన విసయం తెలిసిందే.