JAISW News Telugu

Funerals : అంతరించిపోతున్న బంధాలు: అంత్యక్రియలు చేస్తామంటూ పోటీ పడుతున్న కంపెనీలు..

Funerals

Funerals

Funerals : రాను రాను మానవ సంబంధాలు, సంస్కృతి, సంప్రదాయాలు మంట కలుస్తున్నాయి. అవి మరింత దిగజారిపోతున్నాయనేందుకు నిదర్శనం అంత్యక్రియలకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వెలువడం. తామంటే తాము అంత్యక్రియలు చేస్తామని, వారి కంటే రిచ్ గా చేస్తామని, వారికంటే సంప్రదాయంగా చేస్తామని, వారికంటే గొప్పగా చేస్తామని ఇలా కొట్లాడుకునే పరిస్థితి ఇంకా కొన్ని రోజుల్లో వస్తుంది. ఇది భారత్ కు అత్యంత ముప్పు అని చెప్పేవారు ఉన్నారు.

‘కర్మభూమి’ అంటే తెలియని వారు ఉండరు కదా..? ధనిక-పేద, మంచి-చెడు, కులం-గోత్రం లాంటివి వేటినీ చూడదు. ‘ఓ మనిషి నీకు ఎంత గొప్పవాడివైనా చివరికి రావాల్సింది ఇక్కడికే’ అంటూ పిలుస్తుంది. కానీ రాను రాను శ్మశానం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే బడా బడా కంపెనీలు శ్రీమంతుల కర్మకాండను స్పెషల్ ఆఫీస్ లో చేయబోతున్నారు. ఇది అత్యంత బాధను కలిగించే విషయం. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నట్లు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అన్నీ కంపెనీ దగ్గరుండి చూసుకుంటుంది. అందుకు ముందుగా రూ. 37,500 చెల్లించాలి.

మనిషి మరణిస్తే అతనితో కుటుంబానికి, బంధువులకు, సమాజానికి ఉన్న సంబంధం తెగిపోతుంది. అతనితో సాయం పొందిన వారి నుంచి అతని నుంచి కీడు పొందిన వారు కూడా వచ్చి సాగనంపుతారు. అంతటి గొప్ప సంప్రదాయం దేశం రాను రాను మరిచిపోయేలా కనిపిస్తుంది. మనిషి పుట్టినప్పటి నుంచి ప్రతీ స్టేజీలో బిజినెస్ చేసే పెద్ద పెద్ద  సంస్థలు ఇప్పుడు చావును కూడా టార్గెట్ చేసింది.

సభ్యత్వం తీసుకున్న మనిషి చనిపోయిన తర్వాత కంపెనీకి కబురు అందుతుంది. వారు వెంటనే రంగంలోకి దిగుతారు. చివరి చూపు పనుల నుంచి ఇంటి వారి చేతిలో ఆ మనిషి చితా భస్మాన్ని ఉంచే వరకు అన్నీ కంపెనీ వారు దగ్గరుండి చూసుకుంటారు. చనిపోయిన ఇంట్లో కార్యక్రమాలు, ఇందులో ఏడ్చేవాళ్లు, పండితులు, మంగలి, పూలదండలు అంచక్రియల సామగ్రి, భుజంపట్టి వెంట నడవడం, వంటి వ్యక్తులందరినీ కంపెనీ వాళ్లే పంపిస్తారు. ఇక్కడ అన్ని మతాల వారికి, వారి వారి సంప్రదాయాలలో దహన క్రియలు నిర్వహిస్తారు.

మనిషి చావుపై లాభాలను ఆర్జించిన దేశం కొత్త స్టార్టప్‌గా దీన్ని పరిగణించవచ్చు. కాని రాబోయే కాలంలో ఈ వ్యాపారం 2000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో, కుటుంబ సంబంధాలు, డబ్బుతో ముడిపడి, అతిత్వరలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి మానవీయ సంబంధాలను కొనసాగించేందుకు మన దేశంలో చాలా మందికి సమయం లేదని ‘కంపెనీ’కి బాగా తెలుసు. రాబోయే రోజుల్లో కొడుకులు, కూతుర్లు లేదా సోదరి, సోదరులు లేదా ఇతర బంధువులు, ఎవ్వరు అంత్యక్రియల్లో పాల్గొనరని, ఫోన్లు మాత్రమే చేస్తారని  ఆ  కంపెనీకి ముందే తెలుసు. అందుకే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని బిజినెస్ గా ఎంచుకుంది.

Exit mobile version