Employees : కొవిడ్ 2019లో వ్యాప్తి మొదలు పెట్టింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాటికి ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. గాలి ద్వారా సంక్రమించే ఈ వైరస్ ఒక్క సారిగా దాడి చేయడం, దీని బారిన పడిన వారికి మెడిసిన్ లేకపోవడం, ఉన్న మందులకు లొంగకపోవడంతో వివిధ కంపెనీల్లో ఎంప్లాయీస్ కు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంలోకి వెళ్లాయి. దీంతో ఎంప్లాయీస్ 2019 నుంచి మధ్య నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
మొదటి దశ (ఫస్ట్ వేవ్)లో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. ఇక రెండో దశ (సెకండ్ వేవ్) మరింత భీకరంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. దీంతో మొదటి దశ కంటె ఎక్కువ మంది రెండో వేవ్ లో మరణించారు. తర్వాత థర్డ్ వేవ్ వచ్చే వరకు చాలా మంది వ్యాక్సినేషన్ చేయించుకోవడంతో మరణాల శాతం తగ్గింది. కానీ వైరల్ తీవ్రత తగ్గ లేదని ఎంప్లాయీస్ ఎవరూ కూడా ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడలేదు.
అయితే, కంపెనీలు కూడా ఆఫీసుల మెయింటెనెన్స్ కు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలగడంతో వారు కూడా పెద్దగా ప్రెషర్ పెట్టలేదు. కానీ కొవిడ్ పూర్తిగా తొలగిపోవడంతో కార్యాలయాలకు రావాలని కంపెనీల యాజమాన్యం కోరింది. అయితే అప్పటికే అలవాటు పడ్డ ఎంప్లాయీస్ రామని భీష్మించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కొంత చొరవ తీసుకొని ఎంప్లాయీస్ ను ఆఫీసులకు తీసుకు వస్తే సాఫ్ట్ వేర్ కంపెనీలపై ఆధారపడి జీవించే చిరు వ్యాపారులకు మేలు కలుగుతుందని సూచించారు.
కొవిడ్ నుంచి వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఎంప్లాయీస్ ఎట్టకేలకు ఆఫీసులకు వచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) మిలింద్ లక్కడ్ ప్రకటించారు. ఇది మంచి పరిణామం అని ఆయన చెప్పారు. త్వరలో మిగతా కంపెనీలు కూడా ఇదే బాట పడతాయని, ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని మిలింద్ తెలిపారు.