Empire Dharmasena Trolls : వామ్మో ఆ ఎంపైర్.. ఆయనతో సెల్ఫీ దిగామా.. వరల్డ్ కప్ గోవిందా! సోషల్ మీడియాలో ధర్మసేనపై ట్రోల్స్

Empire Dharmasena Trolls, World Cup Memes
Empire Dharmasena Trolls : వరల్డ్ కప్ అంటే కేవలం మ్యాచ్ లే కాదు.. అప్పడప్పుడు ఫన్నీ మూమెంట్లు కూడా కనిపిస్తుంటాయి. గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్లు చేసే పనుల నుంచి స్టేడియం బయట వరకు వెతుక్కోవాలే గానీ చాలానే దొరుకుతాయి. ఇక నిన్న (నవంబర్ 15) భారత్ వర్సెస్ న్యూజిలాండ్ హోరా హోరీ తలపడగా 70 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ లో అన్ని జట్ల కంటే సెమీ ఫైనల్ లోనే భాగా పోరాడింది భారత్. ఇక ఫైనల్ బెర్త్ ను కన్ఫమ్ చేసుకుంది. ఈ నెల 19వ తేదీ జరిగే ఫైనల్ లో భారత్ తో ఏ టీము తలపడనుందో ఈ రోజు (నవంబర్ 16)న తేలుతుంది.
ఈ రోజు కలకత్తాలో సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికా తలపడనుంది. ఇందులో ఏ టీం విజయం సాధిస్తుందో ఆ టీం 19న భారత్ తో తలపడుతుంది. ఇక వీటిని పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మీమ్ చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రముఖ ఎంపైర్ కుమార్ ధర్మసేన ఏ జట్టుతో అయితే సెల్ఫీ దిగుతాడో ఆ జట్టు రన్నరప్ గా మిగులుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ధర్మసేనపై విపరీతమైన ట్రోల్స్ నడుస్తోంది.
2019 వరల్డ్ కప్ సమయంలో న్యూజిలాండ్ ప్లేయర్స్ తో ఫొటోలు దిగిన ఆయన వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆ సమయంలో ఆ టీం రన్నరప్ గా నిలిచింది. 2022లో పాక్ టీమ్ తో సెల్ఫీదిగి పోస్ట్ చేయగా.. ఆ సమయంలో ఆ టీమ్ కూడా రన్నరప్ గానే నిలిచింది. ఇప్పుడు 2023 టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) కి ముందు టీమ్ ఇండియా కేప్టెన్ రోహిత్ శర్మతో ఫొటో దిగి పోస్ట్ పెట్టాడు. ఆ సమయంలో టీమిండియా కూడా సెకండ్ ప్లేస్ లోనే ఉండాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు వరల్డ్ కప్ 2023లో ఆయన వస్తున్నాడంటనే కేప్టెన్లు పరుగులు పెడుతున్నట్లు ఒక మీమ్ తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దాన్ని షేర్ చేస్తూ విపరీతంగా ధర్మసేను ట్రోల్ చేస్తున్నారు. ఈ మీమ్ కు క్రికెట్ అభిమానులు వింత వింత కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఎంపరింగ్ సరిగారాదని కొందరంటే.. ఆయనతో సెల్ఫీ దిగితే ఓడినట్లే అని మరికొందరు అంటున్నారు. ఇవన్నీ మూఢ నమ్మకాలు అనే వారు లేకపోలేదు. ఏది ఏమైనా ఇలాంటి మీమ్స్ తో కొంత ఫన్నీ జనరేట్ అవుతుందని మాత్రం చెప్పవచ్చు.