Cardiologist Died of Heart Attack : గుండెపోటుతో ప్రముఖ కార్డియాలజిస్ట్ దుర్మరణం
Cardiologist Died of Heart Attack : శకునం చెప్పే బల్లి కుడిదిలో పడిందట. వ్యాఖ్యాత కొడుకు మూగవాడైనట్లు వైద్యం చేసే డాక్టరే గుండెపోటుకు గురై మరణించడం గమనార్హం. విజయవాడలోని రమేష్ కార్డియాక్ హాస్పిటల్ లో కార్డియాలజీ సర్జన్ గా పనిచేసే డాక్టర్ పాటిమళ్ల రమేష్ ప్రసాద్ మంగళవారం అనూహ్యంగా కార్డియాక్ అరెస్టు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
శ్రీనివాస్ దంపతులు సుదీర్ఘకాంగా వైద్యులుగా పనిచేస్తున్నారు. రోజుకు 70-80 మందిని గుండె జబ్బుల రోగులను కాపాడతారు. ఆస్పత్రికి వచ్చిన వారికి శస్ర్త చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించారు. అందరికి వైద్యం చేసినా తనకు వచ్చే ముప్పును మాత్రం గుర్తించలేకపోయారు. పాతికేళ్లుగా వేలాది మంది ప్రాణాలు కాపాడిన వైద్యుడే కార్డియాక్ అరెస్టుతో మరణించడం సంచలనం కలిగించింది.
శ్రీనివాస్ ప్రసాద్ నగరంలోని గాంధీనగర్ లో సాయంత్రం కార్డియాక్ క్లినిక్ సైతం నిర్వహించేవారు. కొవిడ్ సమయంలో దాన్ని మూసేశారు. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత గుండెపోటుతో చనిపోయారు. రాత్రి నిద్రపోయే సమయంలో వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో భార్య వచ్చి చూసే సరికి కుప్పకూలిపోయారు. ఆమె ఎంత ప్రయత్నించినా అప్పటికే చనిపోయారు.
కార్డియాలజిస్ట్ గా క్రిష్ణ, ఉభయగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో శ్రీనివాస్ కు మంచి పేరుంది. ప్రతి రోజు ఓ గంట పాటు వాకింగ్ చేస్తున్నారు. భార్య, అల్లుడు, వియ్యంకుడు అంతా వైద్యులే. కానీ ఆయన మరణాన్ని ఆపలేకపోయారు. చిన్న కుమార్తె నెదర్లాండ్ నుంచి వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. కార్డియాలజిస్ట్ గుండెపోటుతో మరణించడం సంచలనం కలిగించింది.