Emergency landing : సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర లాండింగ్

Emergency landing
Emergency landing on CEC : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్, ఉత్తరాఖండ్ అదనపు సీఈవో విజయ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేశారు. వారు ఉత్తరాఖండ్ లోని మున్సియారీకి వెళ్తుండగా పిథోరాగఢ్ జిల్లాలో ఘటన చోటుచేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హెలికాప్టర్ లో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది.
ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ ను విజయవంతంగా పొలంలో దించారు. విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందగానే సమీపంలోని మున్సియరీ తహసీల్ బృందం అక్కడకు చేరుకుంది.