Sadhguru : ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ అధినేత ప్రముఖ సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఢిల్లీ హాస్పిటల్‌లో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. సద్గురు గత నాలుగు వారాలుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయంలో వైద్యులను కలువగా.. పరీక్షించిన వారు బ్రెయిన్ లో బ్లీడ్ ఉందని నిర్ధారించారు. సర్జరీ చేయకుంటే ఇది ప్రాణాపాయానికి దారి తీస్తుందని చెప్పారు. దీంతో ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు.
ఆపరేషన్ అనంతరం ఆయన బాగానే కోలుకుంటున్నారని, అంచనాలకు మించి మెరుగుపడుతున్నారని సద్గురు ఇషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘నొప్పి తీవ్రత ఉన్నప్పటికీ, అతను తన షెడ్యూల్, కార్యకలాపాలను కొనసాగించాడు. 8 మార్చి, 2024న రాత్రి మహా శివరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ వినిత్ సూరి సలహా మేరకు, సద్గురు అత్యవసరంగా MRI చేయించుకున్నారు. ఇందులో ఆయన వ్యాధి బయటపడింది. మెదడులో రక్తస్రావం ఉన్నట్లు కనుగొన్నారు.
మార్చి 17వ తేదీ, సద్గురు తన ఎడమ కాలు బలహీనంగా ఉందని, నిరంతర వాంతులతో తలనొప్పి తీవ్రంగా ఉందని ఫిర్యాదు చేయడంతో అతని పరిస్థితి మరింత దిగజారింది.
ఇషా ఫౌండేషన్ నుంచి వచ్చిన ప్రకటనలో, ‘ఎట్టకేలకు అతను అడ్మిట్ అయ్యాడు. ఒక CT స్కాన్ మెదడు వాపులో గణనీయమైన పెరుగుదలను, ఒక వైపునకు ప్రాణాంతక బ్లీడింగ్ ఉందని వెళ్లడించింది. అతని పుర్రెలో రక్తస్రావం నుంచి ఉపశమనం పొందడానికి అతను ప్రవేశించిన కొన్ని గంటల్లోనే అత్యవసర బ్రెయిన్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సద్గురు శస్త్రచికిత్స తర్వాత వెంటిలేటర్ పై ఉంచారు.
‘అపోలో హాస్పిటల్‌లోని న్యూరో సర్జన్లు నా బ్రెయిన్ ను కోసి ఏదో వెతకడానికి ప్రయత్నించారు. కానీ వారు ఏమీ కనుగొనలేదు.. పూర్తిగా ఖాళీగా ఉందని అన్నారు.. వారు దానిని వదులుకున్నారు. ఇక్కడ నేను ఢిల్లీలో ఉన్నాను. తనకు ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని’ సద్గురు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.