JAISW News Telugu

Elon Musk : H-1B వీసాలపై ఎలన్ మస్క్ సంచలన ప్రకటన

Elon Musk

Elon Musk tweet on H1B visas

Elon Musk : H-1B వీసాలను స్థానికంగానే రెన్యూవల్ చేసుకునే ప్రక్రియను బైడెన్ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ రెన్యూవల్ పనులు మొదలు కాబోతున్నాయి. వృత్తి పరమైన వలస దారులకు ఇచ్చే ఈ వీసా రెన్యూవల్ విషయంపై ప్రముఖుుల ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. దీనిపై ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలన్ మస్క్ కూడా స్పందించారు.

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ గురించి ఎలన్ మస్క్ ఎక్స్ ద్వారా స్పందించారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తూ నైపుణ్యం కలిగిన కార్మికులను చట్టపరంగా అమెరికాలోకి తీసుకొని రావడం సులభతరం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. స్థానికంగానే H-1B రెన్యూవల్ చేయడంను ఆయన ‘పిచ్చితనం’గా అభివర్ణించారు. అక్రమ వలసలను నిలిపివేయాలని, చట్టపరమైన వలసలు గణనీయంగా పెంచాలని ఆయన కోరారు.

చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించడం సులభమని దీంతో చట్టబద్ధమైన వలసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మస్క్ పేర్కొన్నారు. దీన్ని మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన H-1B వీసా కోసం నైపుణ్యం కలిగిన వ్యక్తుల నుంచి పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల గురించి ఒక చార్ట్ కు సమాధానంగా పోస్ట్ చేశారు.

అక్రమ వలసలపై తన ఆందోళనలతో పాటు, H-1B వీసాల కోసం కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితిని సంవత్సరానికి 85,000గా మస్క్ ఎత్తి చూపారు. దీన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన వలసదారుల ఆంక్షలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) డేటాను ఆయన హైలైట్ చేశారు.

H-1B వీసా అమెరికా యజమానులను వారి అవసరాల కోసం విదేశీ కార్మికులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. మస్క్ నైపుణ్యం కలిగిన నిపుణులకు, ముఖ్యంగా టెక్ పరిశ్రమలో దాని ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. రెండు దశాబ్దాలుగా H-1B దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతున్నట్లు చూపించే చార్ట్ ను ఆయన ప్రస్తావించారు.

ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని మస్క్ విమర్శించారు. రెన్యూవల్ విధానంతో సమస్యను ఈ సంఖ్యలు స్పష్టంగా సూచిస్తున్నాయని, దీనిని ‘విపత్తు’ అని ఆయన పేర్కొన్నారు. వలసదారుల రాక కారణంగా న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుత యంత్రాంగం తగినంతగా చేయలేదని విమర్శించారు.

Exit mobile version