Elon Musk to India : ఇండియాకు ఎలోన్ మస్క్.. టెస్లా లాంచ్ కోసమే!

Elon Musk to India

Elon Musk to India

Elon Musk To India : ఎలోన్ మస్క్ ఇండియాకు వస్తున్నాడా.. అంటే అవుననే చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ‘టెస్లా’ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన కార్ల తయారీ సంస్థ. ఈ కంపెనీ బాస్ ఎలోన్ మస్క్. అయితే ఆయన తన కార్ల ఉత్పత్తులను భారతదేశం నుంచి ప్రారంభించాలని ఉత్సాహ పడుతున్నారు. ఈ విషయమై గతంలో చాలా సార్లు భారత ప్రభుత్వం, టెస్లాతో సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహించింది. మేడ్-ఇన్-ఇండియాలో భాగంగా టెస్లా ఇండియాలో తన ఉత్పత్తులను ప్రారంభించనుంది.

వచ్చే ఏడాది (2024) జనవరిలో ఎలోన్ మస్క్ భారత పర్యటనను అధికారికంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎలోన్ మస్క్ పర్యటనలో భాగంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొంటారు. దీని తర్వాత రోడ్డు రవాణా అండ్ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు, సమావేశాలు, వాణిజ్యం-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ వెహికల్ ఆటో కాంపోనెంట్‌ల మౌలిక సదుపాయాలు, వాటి సరఫరా చెయిన్ భారత్ లో విస్తృతంగా ఉండడంతో తన ఫ్యాక్టరీని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నడు మస్క్. దేశంలోని లాజిస్టిక్స్‌కు మరియు ఎగుమతులకు ఈ రాష్ట్రంలోని రోడ్డు, ఓడరేవుల మౌలిక సదుపాయాలు అవకాశం కల్పిస్తాయి.

ఈ ఒప్పందం ప్రకారం, కంపెనీ మొదట తన కార్లను భారత్ లో విక్రయిస్తుంది. భారత ప్రభుత్వం టెస్లాకు తక్కువ దిగుమతి సుంకాన్ని విధించనుంది. దీంతో వినియోగదారుడికి కూడా తక్కువకే టెస్లా అందుతుంది. భారత్ లో ఎలోన్ మస్క్ ప్రారంభంలో మొత్తం 2 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నారు. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోతూ రెండేళ్లలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడే ఉత్పత్తి, అమ్మకం, ఎగుమతి జరుగుతుంది. దీంతో టెస్లా తక్కువ రేటుకు భారతీయుడికి అందే అవకాశం లేకపోలేదు.

ఎలోన్ మస్క్ సంస్థ టెస్లా అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టడం, తయారీ ప్రారంభించడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎలక్ట్రిక్ కార్, టెక్నాలజీ, బ్యాటరీ, విడిభాగాల తయారీకి సంబంధించి ప్రపంచంలోని మరిన్ని సంస్థలు భారత్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

TAGS