Electric roads : ఇప్పుడు కార్లు అన్నీ ఎలక్ట్రిక్ నే.. విద్యుత్ తో నడుస్తున్నాయి. కర్భణ ఉద్గారాలు తగ్గించడం.. పర్యావరణానికి మేలు చేయడంతోపాటు పెట్రోల్ భారం నుంచి చీప్ గా ప్రయాణం సాగించేందుకు అందరూ పెట్రోల్ డీజీల్ కార్లకు స్వస్తి పలికి ఎలక్ట్రిక్ కార్లు వాడుతున్నారు. దేశంలో నూ ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోళ్లు ఎక్కువ అవుతున్నాయి. ఈక్రమంలోనే ఎలక్ట్రిక్ పాయింట్ల ఏర్పాటు కూడా వేగంగా జరుగుతోంది.
ప్రపంచంలోనే తొట్టతొలిసారిగా స్వీడన్ లో ఎలక్ట్రిక్ హైవేలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఈ రోడ్ల మీద ఎలక్ట్రిక్ కార్లు నడుస్తుండగా ఛార్జింగ్ అవుతాయి, ఇటువంటి రోడ్లు మన విశాఖపట్నంలో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రచిస్తున్నారు… ప్రపంచం మొత్తం మీద స్వీడన్ దేశంలో మాత్రమే ఇటువంటి రోడ్లు ఉన్నాయి…. విశాఖపట్నం మీద చంద్రబాబు గారికి అభిమానంతో ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు..