Political Leaders : ఎన్నికలు క్లోజ్.. టూర్లు, షికార్లలో నేతలు.. ఫుల్ స్వింగ్ లో ఉన్నారే
Political Leaders : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ముగిసింది. ఇన్నాళ్లు మండుటెండలను కూడా లెక్క చేయకుండా ప్రజల మధ్య తిరిగి ఓట్లు రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బిజీబిజీగా గడిపిన నాయకులు పోలింగ్ ముగియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ పూర్తి అయింది.. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అంటే దాదాపు 20 రోజుల టైం గ్యాప్ ఉంది. చాలా రోజుల సమయం ఉండడంతో నాయకులంతా తమ వ్యక్తిగత పనులు చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఎన్నికల హడావుడిలో పడి కుటుంబానికి దూరంగా ఉన్న నాయకులు ఈ గ్యాప్‌లో వ్యక్తిగత జీవితానికి కాస్త సమయం కేటాయిస్తున్నారు. ఎంచక్కా దేశవిదేశాల్లో పర్యటించేందుకు ప్లాన్లు వేస్తున్నారు. కొందరు నాయకులైతే ఇప్పటికే టూర్లకు వెళ్లారు. ఎన్నికల ఫలితాలకు రెండు మూడు రోజుల ముందు మళ్లీ సొంత ఊర్లకు చేరుకునే అవకాశాం ఉంది.
ఫలితాలు వచ్చేలోపు కాస్త సేదతీరేందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేరళ పర్యటనకు వెళ్లారు. అనూహ్యంగా ఎమ్మెల్యేలతో ఆయన ట్రిప్ వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే రాజకీయ పర్యటననా? లేదా వ్యక్తిగత పర్యటన అనేది తెలియాల్సి ఉంది. రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మంగళవారం అమెరికాకు వెళ్లారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మంగళవారం యాక్టివా బండిపై అల్లుడిని ఎక్కించుకుని నగరంలో తిరిగారు. ఓ బేకరికి వెళ్లారు. చాలా మంది ఆయన ఫ్యాన్స్ తనతో కలిసి సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన బంధువులు, పిల్లలతో సరదాగా గడిపారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లనున్నారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమయ్యారు. కనీసం రెండు, మూడు వారాల పాటు తమను ఎవరూ సంప్రదించవచ్చని తమ అనుచరులు, అభిమానులకు సూచిస్తున్నారు.

పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు నాయకులు కూడా సేద తీరుతున్నారు. దేశ విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తున్నారు. తమ కూతురిని చూడడానికి లండన్ వెళ్లనున్నారు. ఆయన విదేశీ పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవలే అనుమతినిచ్చింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లనున్నారు. అన్ని పార్టీల నాయకులు వ్యక్తిగత పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ అధినేతలతోపాటు సామాన్య కార్యకర్తలు కూడా వ్యక్తిగత పనుల్లో బిజీ అయ్యారు.
TAGS AP Elections 2024AP LeadersBandi SanjayJagan Foreign TourPolitical LeadersPonguleti Srinivas Reddyponnam prabhakarTelangana LeadersYS Jagan