JAISW News Telugu

Election Notification : ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల నగారా..ఏపీలో తొలి విడతలోనే..?

Election Notification

Election Notification Release Today

Election Notification 2024 : ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నగారా మోగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ పండుగకు సర్వం సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎన్నికల ప్రధాన కమిషనర్  రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధూ ప్రెస్ మీట్ లో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించనున్నారు. 18వ లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.

గతంలో జరిగిన 2004 ఎన్నికల్లో నాలుగు దశలు, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి ఎన్ని దశల్లో జరుగుతాయనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, ఈ సారి ఆరు రోజులు ఆలస్యంగా షెడ్యూల్ విడుదల కాబోతోంది.

గతంలో ఏపీ అసెంబ్లీకి తొలి విడతలోనే ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండే చాన్స్ ఉంది. దీంతో ఏపీలో ఎన్నికలకు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటన ముగింపు దశలో ఉంది. మిగిలిన అభ్యర్థులను కూడా తొందర్లోనే ప్రకటించి ప్రచార రణరంగంలోకి దూకబోతున్నాయి.

వైసీపీ ఒంటరి పోరు చేస్తుండగా.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జగన్ పార్టీని ఎదుర్కొనబోతున్నాయి. జగన్ ను గద్దె దించడమే ధ్యేయంగా చంద్రబాబు, పవన్ పనిచేస్తున్నారు. యువత కలల సాకారం, రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ కూటమి పోరాటంలోకి దిగబోతోంది. జగన్ ను గద్దె దించితేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాకతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

Exit mobile version