Election Commission : నగదు బదిలీపై ఏపీ సర్కార్ కు ఈసీ షాక్
Election Commission : మరో రెండు రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు నగదు బదిలీ డబ్బులను జమ చేయాలని తెగ ఉబలాటపడుతున్న రాష్ట్ర సర్కార్ కు ఈసీ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు డీబీటీలకు నిధులెందుకు ఇవ్వలేదని లేఖలో ఈసీ ప్రశ్నించింది. ఇప్పటివరకు ఇవ్వలేని ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కసారిగా నిధులెలా సర్దుబాటు అయ్యాయి? ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెబుతారు? ఇలా సొమ్ములు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరుగదా..లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినదా? సమాధానం చెప్పాలని లేఖ రాసింది.
గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలకు నిధులు బటన్ నొక్కిన నాటి నుంచి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వాలన్నారు. ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆలస్యమైంది. పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారో కూడా చెప్పాలని స్పష్టం చేసింది. ఈరోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే ప్రమాదం ఏంటీ? సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు, నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్, మే నెలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని ముందుగా తెలియదా? అని ప్రశ్నించింది.
పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు అంత తొందర ఏమొచ్చింది? ముందుగానే పంపిణీ తేదీని నిర్ణయించి ఉంటే ఆ వివరాలను కూడా డాక్యుమెంట్ రూపంలో అందించాలని స్పష్టం చేసింది. ఈసీ అడిగిన వివరాలు ఇస్తే వైసీపీ ప్రభుత్వం బండారం మొత్తం బయటపడిపోతుంది. అందుకే ఇవన్నీ లెంగ్తీ క్వశ్చన్స్ అని చెప్పి అరకొర సమాధానం ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి జగన్ సర్కార్ చేస్తున్న డ్రామాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీటికి పోలింగ్ రోజునే సమాధానం చెప్తారు.