Delhi Elections : మోగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా

Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.జనవరి 10న నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.

ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నట్లు సీఈసీ నివేదించింది. దీని ప్రకారం 13,033 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎస్పీ మద్దతు తెలిపింది. దీంతో ట్విట్టర్ వేదికగా అఖిలేష్ యాదవ్ కు అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.మీరు ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇస్తారు, తోడుగా ఉంటారని పేర్కొన్నారు. ఇందుకు నేను, ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

TAGS