JAISW News Telugu

Bhashyam Praveen : మల్లాది గ్రామంలో భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం

FacebookXLinkedinWhatsapp
Bhashyam Praveen

Bhashyam Praveen Campaign

Bhashyam Praveen : అమరావతి మండలం మల్లాది గ్రామంలో శుక్రవారం పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.

సంక్షేమానికి, అభివృద్ధికి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు అని, గ్రామ స్థాయిలో సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version