YS Jagan : అన్న దండం పెడితే.. తమ్ముడు పిండం పెట్టేశాడు
YS Jagan : కరోనా నుంచి అప్పుడప్పుడు కొంత బయట పడుతున్న సమయం. అదే సమయంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ సిద్ధంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ర్టాలు ఆ సినిమాకు సపోర్ట్ చేస్తే కేవలం ఒకే ఒక్క సీఎం అడ్డుపుల్లలు వేస్తూ వచ్చాడు. అదీ తెలుగువాడైనా ఏపీ సీఎం జగన్. ఎందుకంటే 2019లో వైసీపీ విజయం సాధించిన తర్వాత సినీ ఇండస్ర్టీ నుంచి పెద్దలెవరూ అప్పటి సీఎం జగన్ ను కలవలేదు. దీంతో తన అహం దెబ్బతిన్నది. దీంతో జగన్ ఏకంగా సినిమా ఇండస్ర్టీనే టార్గెట్ చేసుకున్నాడు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచనివ్వకపోవడం, థియేటర్ల వద్ద రెవెన్యూ సిబ్బందిని పెట్టి మరీ బుకింగ్ కౌంటర్లు ఓపెన్ చేయించే స్థితికి దిగజారాడు జగన్.
గొడవెందుకని..
కరోనాతో సినీ పరిశ్రమ చాలా దెబ్బతిన్నది. దాదాపుఏడాది పాటు సినిమా హాళ్లు తెరుచుకోక ఎంతో మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలోని మరికొంత మంది స్టార్ హీరోలు, దర్శకులతో కలిసి జగన్ ను కలిశారు. సినిమా ఇండస్ర్టీపై కాస్త దయ చూపమని కోరాడు రెండు చేతులు జోడించి అడిగాడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అప్పుడు తన స్టార్ హీరో స్టేటస్ ను చూసుకోలేదు. సగటు తెలుగు సినీ పరిశ్రమ పెద్ద బిడ్డగా వ్యవహరించానని చెప్పుకొచ్చాడు. చిరంజీవి తగ్గాడని జగన్ రాక్షసానంతం పొందాడు. కానీ చిరంజీవి చేతులు జోడించి ప్రాధేయ పడిన విజువల్స్ మెగాస్టార్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోయాడు. రాష్ర్టంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించే సినీ పరిశ్రమపై జగన్ ప్రతాపం ఏమిటని జనమంతా ఆలోచించారు. సమయం కోసం వేచి చూశాడు.
తమ్ముడి మనసు గాయపర్చిన సీన్
జగన్ ను కలిసి సందర్భంలో చిరంజీవి ప్రాధేయ పడిన విధానం సగటు సినీ ప్రేక్షకుడే జీర్ణించుకోలేకపోయాడు. ఆ దృశ్యం తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మససును ఎంతో గాయపర్చింది. దాసరి నారాయణ తర్వాత ఇండస్ర్టీకి పెద్దబిడ్డలాగా ఉంటున్న తన అన్న మెగాస్టార్ చిరంజీవిని జగన్ ను ప్రాధేయ పడేలా చేయడం పవన్ లో కసిపెంచడానికి కారణమైంది. తన సినిమాలను అడ్డుకున్నా పర్వాలేదు. కానీ తన వల్ల ఇతర సినిమాలకు ఇబ్బందులు రాకూడదని పవన్ సైతం సైలెంట్ ఉండిపోయాడు. ఇక ఈ సమయంలో జగన్ లోని రాక్షసుడు మహా ఆనందం పొందాడు. ఆర్ఆర్ఆర్ తో పాటు మరికొన్ని సినిమాలకు సడలింపుల ఇచ్చినా జగన్ మళ్లీ మొదటికి వచ్చాడు. ముందుగా పవన్ సినిమాలు ఆ తర్వాత ఇతర పెద్ద హీరోల సినిమాలకు యథావిధిగా తన ప్రభుత్వంలోని మంత్రులతో మళ్లీ అడ్డుపుల్లలు వేయిస్తూ వచ్చాడు. ఎంతలా అంటే కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేసేదాకా వెళ్లాడు. పవన్ కల్యాన్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సినిమా విడుదల తర్వాత తప్పుడు కలెక్షన్లు చూపిస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని అప్పటి మంత్రి అంబటి రాంబాబు ఎలా బెదిరింపులకు పాల్పడ్డాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమా నిర్మాత సైతం అంబటికి స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తానేమీ తప్పుడుమార్గంలో వెళ్లలేదని చెప్పడంతో అంబటి నోరుమూసుకోక తప్పలేదు.
వారాహితో దాడి షురూ..
ఇన్ని ఘటనల తర్వాత పవన్ ఇక సైలెంట్ గా ఉండలేదు. వారాహి యాత్రతో నేరుగా వైసీపీ ప్రభుత్వంతో తలపడ్డాడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ను చీల్చి చెండాడు. తన అన్నతో దండం పెట్టించుకున్న జగన్ కు పవన్ పిండం పెట్టేశాడు. అసలు ప్రతిపక్షంలోనే లేకుండా చేసేశాడు. కళాకారుడు కన్నెర్ర జేస్తే ఇప్పటికైనా జగన్ తెలుసుకుంటాడో లేదో చూడాలి మరి.