Ejaz Patel : టీమిండియాపై ఎజాజ్ పటేల్ సరికొత్త రికార్డు.. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్
Ejaz Patel : భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఎజాజ్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యేక జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ 21.4 ఓవర్లలో 103 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టి ఇయాన్ బోథమ్ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టాడు.
నంబర్ వన్ స్థానంలో ఎజాజ్ ..
భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఎజాజ్ పటేల్ నాలుగో వికెట్ పడగొట్టడంతో మొత్తం 23 వికెట్లు తీసిన బౌలర్ గా మొదటి స్థానంలో నిలిచాడు. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎజాజ్ ఈ ఘనత సాధించాడు. భారత్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన విదేశీ బౌలర్ల జాబితాలో ఎజాజ్ పటేల్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో చాలా మంది దిగ్గజ బౌలర్లు ఉన్నారు. ఇప్పటి దాకా ఇయాన్ బోథమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వాంఖడే స్టేడియంలో ఇయాన్ బోథమ్ 22 టెస్టు వికెట్లు పడగొట్టాడు.
భారత గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన విదేశీ బౌలర్లు..
23 – అజాజ్ పటేల్, ముంబై (వాంఖడే)
22 – ఇయాన్ బోథమ్, ముంబై (వాంఖడే)
18 – రిచీ బెనాడ్, ఈడెన్ గార్డెన్స్
17 – కోర్ట్నీ వాల్స్, ముంబై (వాంఖడే)
16 – రిచీ బెనాడ్, నెహ్రూ స్టేడియం, చెన్నై
16- నాథన్ లియోన్, ఢిల్లీ
22 – ఇయాన్ బోథమ్, ముంబై (వాంఖడే)
18 – రిచీ బెనాడ్, ఈడెన్ గార్డెన్స్
17 – కోర్ట్నీ వాల్స్, ముంబై (వాంఖడే)
16 – రిచీ బెనాడ్, నెహ్రూ స్టేడియం, చెన్నై
16- నాథన్ లియోన్, ఢిల్లీ
ముంబైలో ఎజాజ్ ఆధిపత్యం
ముంబైలోని వాంఖడే స్టేడియంలో అజాజ్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వాంఖడే స్టేడియంలో అతనికి రెండో మ్యాచ్. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 14 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 119 పరుగులకు 10 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఎజాజ్ పటేల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 106 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.