Gouri khan:కింగ్ ఖాన్ షారూఖ్ 2023లో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల క్లబ్ చిత్రాలతో సంచలనంగా మారాడు. అతడు నటించిన డంకీ ఈనెల 21న అత్యంత భారీగా విడుదలవుతోంది. ఇలాంటి సమయంలో షారూఖ్ భార్య గౌరీఖాన్ కి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నుంచి నోటీస్ అందడం కలకలం రేపింది. నిజానికి పఠాన్-జవాన్ చిత్రాలకు గౌరీఖాన్ నిర్మాత. డంకీ చిత్రాన్ని గౌరీఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఈడీ నోటీసులు దేనికి? అంటే నిర్మాతగా గౌరీఖాన్ ఆర్జిస్తున్న దానికి లెక్కలు చెప్పాలని ఇది రాలేదు. వెయ్యి కోట్ల క్లబ్ చిత్రాల నిర్మాతగా ఈ నోటీసుల్ని అందుకోలేదని తెలియడం షాకిస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ED నోటీసుకు ఈ సంవత్సరం ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రాల ఆదాయానికి ఎలాంటి లింక్ లేదు. లేదా డంకీ బిజినెస్ తో వచ్చిన మొత్తంపైనా ఆరాలు కానే కావు. దాదాపు రూ. 30 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ తులసియానీ గ్రూప్‌ను ఆమోదించినందుకు గౌరీకి ED నోటీసు వచ్చింది. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న గౌరీ ఖాన్, రియల్ ఎస్టేట్ సంస్థ దుష్ప్రవర్తనకు సంబంధించి ఆమెకు ED నోటీసులు అందాయి.
అయితే పఠాన్ – జవాన్‌ల కోసం ఫేక్ కలెక్షన్‌లను పోస్ట్ చేసినందుకు, అలాగే డంకీ కోసం బల్క్ కార్పొరేట్ బుకింగ్‌లను ప్లాన్ చేసినందుకు ED నోటీసులు అంది ఉండొచ్చని నెటిజన్లలోని ఒక వర్గం వాదిస్తున్నారు. అయితే అందజేసిన ఈడీ నోటీసుల్లో ఈ అంశాలు లేనే లేవని తెలిసింది. గౌరీఖాన్ పాపులర్ ఇంటీరియర్ డిజైనర్ గా కోట్లాది రూపాయల ఆదాయాన్ని కలిగి ఉన్నారు. సుమారు 5000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న జంటగా షారూఖ్ -గౌరి పేరు మార్మోగుతోంది.