skill development case : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింద. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తోంది. అయితే ఈ కేసులో తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఈడీ తాజా విచారణ తర్వాత సీఎం చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. ఈడీ విచారణ ప్రకారం నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని నిరూపణ అయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారాన్ని ఈడీ వర్గాలు తప్పుపట్టాయి.
సెప్టెంబరు 9, 2023న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతినక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను బస్సులో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తీసుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాదాపు 52 రోజుల అనంతరం చంద్రబాబు బెయిల్ పై విడుదలయ్యారు.