JAISW News Telugu

MLC Kavitha : కవిత అరెస్ట్.. ఢిల్లీకి తరలింపు.. ‘లిక్కర్ స్కాం’ వదిలేలా లేదే..!

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి  బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్ తో వచ్చిన పలువురు అధికారులు సుమారు నాలుగు గంటలపాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి పలు డాక్యుమెంట్లతోపాటు కవిత ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

కవిత ఇంట్లో ఈడీ, ఐటీ తనిఖీలు..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పది బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. కవితతో పాటు ఆమె భర్త వ్యాపార వ్యవహారాలపై పూర్తిస్థాయి సమాచారంతో వచ్చి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. తనిఖీల సందర్భంగా పోలీసులు పెద్దఎత్తున ఆమె ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.

కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెద్దఎత్తున లాభపడ్డారని ఇప్పటికే సీబీఐ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేశాయి. స్కాం ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె ఆస్తులు కొనుగోలు చేశారని ఇందుకోసం ఆమె భర్త సంస్థలను వాడుకున్నారని కూడా చార్జిషీటులో పెట్టారు. అన్ని కలిపి ఒకే సారి సోదాలకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకావడం లేదు. కోర్టులో ఓ పిటిషన్ వేసి అదే పనిగా..అదే కారణం చూపి డుమ్మా కొడుతున్నారు. ఇటీవల సీబీఐ ఇచ్చిన నోటిసులకూ హాజరు కాలేదు. ఈక్రమంలో ఢిల్లీ నుంచి అధికారులు సోదాలకు రావడం అనూహ్యమైన పరిణామంగా మారింది.

లోక్ సభ ఎన్నికల్లో కూడా కవిత పోటీ చేయడం లేదు. నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ను కేసీఆర్ ఖరారు చేశారు. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. జాతీయ అంశాల్లో కాంగ్రెస్ పై తరుచూ విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెపై దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. సౌత్ లాబీ నుంచి నిందితులుగా ఉన్న వారిలో ఒక్క కవిత తప్ప అందరూ అప్రూవర్లుగా మారడం గమనార్హం.

Exit mobile version