Eco Park in Hyderabad : హైదరాబాద్ లో ఎకో పార్క్.. స్పెషలేంటో తెలుసా..?

Eco Park in Hyderabad

Eco Park in Hyderabad, Kothwal Guda Eco Park

Eco Park in Hyderabad : ప్రపంచంలోనే అతిపెద్ద పక్షుల శాల మన హైదరాబాద్ లో ప్రారంభం కాబోతుున్నది.  అత్యంత పెద్దదయిన ఈ కొత్వాల్ గూడ ఎకో పార్కును వచ్చే అర్థక సంవత్సరంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులకు నచ్చేలా, మెచ్చేలా అతిపెద్ద టూరిజం స్పాట్ లా దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆస్ట్రేలియా, పెరూ, అర్జెంటీనా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన అరుదైన జాతుల పక్షులు, జంతువులను నగరంలోని కొత్వాల్‌గూడలోని ఎకో-హిల్ పార్క్‌లో ఉంచుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షిశాల (పక్షుల అభయారణ్యం) ఒకటి.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కొత్వాల్‌గూడలో ఆరు ఎకరాల స్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వాక్-త్రూ ఏవియరీని అభివృద్ధి చేసింది. వివిధ రకాల పక్షుల  గురించి తెలుసుకునేందుకు ఇది సదావకాశంగా మారబోతున్నది. దీంతో పాడు సరీసృపాలను కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. పక్షిశాల నిర్వహణ, కార్యకలాపాల కోసం ఏజెన్సీ రూ. 8 కోట్లు, మొత్తం ఎకో పార్క్‌ను రూ. 75 కోట్లతో నిర్మించామని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

గూడు కట్టడంలో పక్షులు మరియు జంతువులను నిలబెట్టడానికి ప్రత్యేకమైన వృక్షజాలం (వృక్షసంపద) అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. పక్షులు జీవించి ఉండడానికి వాటి ఆహారం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఇక్కడే అతిపెద్ద అక్వేరియం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రత్యేక సీతాకోకచిలుక ఆకారపు ఉద్యానవనాన్ని ఇందులో ప్రారంభించబోతున్నారు. ప్రత్యేక పిక్నిక్ పార్క్ తో పాటు ఫుడ్ కోర్టులు, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఈ పార్కులో ఏర్పాటు చేస్తున్నారు. ఇక సందర్భకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఇక్కడ పలు ఏర్పాట్లు చేస్తున్నారు.

TAGS