Cabinet Meeting : రేవంత్ కు ఈసీ ఝలక్..కేబినెట్ మీటింగ్ పై కీలక నిర్ణయం

Cabinet Meeting

Cabinet Meeting Revanth Reddy

Cabinet Meeting : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు దాటుతోంది. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని ఆ పార్టీ  వాగ్దానం చేసింది. అయితే ఎన్నికల కోడ్ రాకముందు ఆరు గ్యారెంటీల్లోని కొన్ని పథకాలను మాత్రమే అమల్లోకి తెచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చాక మిగతా పథకాలు ప్రారంభం కాలేదు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ పథకాలు మాత్రమే అమల్లోకి వచ్చాయి. మిగతా పథకాలను అమలు చేయడానికి లోక్ సభ ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. అయితే ఎన్నికలు పూర్తికావడంతో మిగతా హామీలపై కేబినెట్ మీటింగ్ చర్చిద్దామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

కాగా, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఝ‌ల‌క్ ఇచ్చింది. గ‌త రెండు రోజుల నుంచి కేబినెట్ స‌మావేశం ఉంటుందని చెప్పిన కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌రుగుతుంద‌ని రెండు రోజుల క్రితం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఒక వైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల కోడ్, మ‌రో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో రేవంత్ కేబినెట్ స‌మావేశానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉందంటూ ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఈ నెల 27న ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 4న లోక్‌స‌భ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు అనంత‌రం ఎన్నిక‌ల కోడ్ ముగియ‌నుంది.  ఆ తర్వాత మాత్రమే కేబినెట్ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. ఆ మీటింగ్ లోనే రుణమాఫీ లాంటి కీలక హామీలను చర్చించనున్నారు.

TAGS