JAISW News Telugu

YCP : వైసీపీకి ఈసీ బిగ్ షాక్.. ఆ అభ్యర్థిపై యాక్షన్ తప్పదు..

EC big shock for YCP

YCP

YCP : గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అంబటి మురళీకృష్ణ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ టీడీపీ అభ్యర్థి చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. వారి ఆరోపణ నిజం అని తేలడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 13న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి ధర్నా చేశారని తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ కృష్ణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. వంశీ కృష్ణ ఫిర్యాదుతో విచారణ చేయించాలని సీఈవో కలెక్టర్ కు సూచించారు. ఇందులో మురళీకృష్ణ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని నివేదిక ఇచ్చారు.

దీంతో మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశించారు. ఇంకా మురళీకృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు కూడా తెలిసింది. దీంతో ఆయన భవితవ్యం గందరగోళంలో పడింది. వైసీపీ అభ్యర్థుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం వారికి అలవాటే. ఈనేపథ్యంలో మురళీకృష్ణ తీరు వివాదాస్పదంగా మారింది.

ఇలా వైసీపీ నేతలు అడుగడుగునా నేర చరిత్రతోనే ముందుకు వెళ్తున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థులు వారిపై ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే తరహాలోనే ముందుకు వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ వారికి తగిన గుణపాఠం చెబుతారనే వాదనలు కూడా వస్తున్నాయి.

ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి చోట ఏదో ఒక రభస చేస్తూనే ఉన్నారు. నిజాయితీగా వ్యవహరించే అలవాటు మరిచిపోయారు. దీంతో ఎవరైనా అడ్డం వస్తే వారిని అవసరమైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. చివరకు ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియడం లేదు.

Exit mobile version