Foods Disturbs Your Sleep : రాత్రి పడుకునే సమయంలో వీటిని తింటే నిద్రకు భంగమే తెలుసా?
Foods Disturbs Your Sleep : ప్రతి మనిషికి నిద్ర ఎంతో ముఖ్యం. నిద్ర పోకపోతే అలసిపోతాం. రోజంతా ఇబ్బందిగా అనిపిస్తుంది. శక్తి ఉండదు. ఇలా ఎన్నో నష్టాలుంటాయి. రోజుకు 7-8 గంటలు నిద్ర పోతే ఎలాంటి రోగాలు లేకుండా ఉంటుంది. లేకపోతే పలు రోగాలు మనల్ని చుట్టుముడతాయి. నిద్ర లేకపోతే అనారోగ్యాలు దరిచేరడం ఖాయం. సరైన తిండి సుఖమైన నిద్ర పోకపోవడం వల్ల రోగాలు దరిచేరతాయి.
రాత్రి పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నిద్రకు భంగం కలుగుతుంది. పడుకునే సమయంలో చాక్లెట్ తింటే నిద్ర పట్టదు. ఇబ్బందిగా మారుతుంది. ఈ విషయం తెలుసుకుని పడుకునే ముందు చాక్లెట్లు తినేందుకు మొగ్గు చూపకపోవడమే బెటర్. ఇలా మనం చాక్లెట్ కు దూరంగా ఉండకపోతే మనకే నష్టం వాటిల్లుతుంది.
రాత్రి చిప్స్ తినడం కూడా అంత శ్రేయస్కరం కాదు. ఇవి తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. తిన్న ఆహారాలు జీర్ణం కాకుండా పోతాయి. దీని వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది. ఫలితంగా నిద్రకు ఆటంకాలు ఏర్పడతాయి. నిద్రకు దూరం కావాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. దీంతో రాత్రి పడుకునే సమయంలో చిప్స్ తినడం సురక్షితం కాదని తెలుసుకోవాలి.
సాధారణంగా మనకు వెల్లుల్లి వల్ల ఎన్నో లాభాలున్నాయి. కానీ దీన్ని పగటి సమయంలో తినడం వల్ల మేలు కలుగుతుంది. రాత్రి పడుకునే సమయంలో వీటిని తింటే నిద్రకు ఇబ్బందులే వస్తాయి. ఇందులో ఉండే రసాయనాలు అశాంతికి గురిచేస్తాయి. భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు ఉండటం వల్ల నిద్రకు విఘాతం కలిగిస్తాయి. అందుకే దీనికి దూరంగా ఉండటమే మేలు.