Earthquake : తెలంగాణలో మళ్లీ భూకంపం..
Earthquake again : తెలంగాణలోని ములుగులో ఇటీవల భూకంపం సంభవించింది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనాలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైన సంగతి తెల్సిందే.
తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. భూ ప్రకంపనాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ళ నుంచి బయటికి పరుగులు తీశారు.