నటీనటులు : రవితేజ అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు.
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని
సంగీతం : దేవ్జంద్
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
‘రావణాసుర’,’టైగర్ నాగేశ్వర రావు’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వాల్సింది, కానీ థియేటర్స్ కొరత కారణంగా ఈ సినిమా ఫిబ్రవరి 9 వ తేదికి వాయిదా పడింది. ఈ గ్యాప్ లో ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో రవితేజ సినిమాకి ఇంత హైప్ రావడం ‘ఈగల్’ చిత్రానికే జరిగింది. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
తలకోన అనే దట్టమైన అడవి లో సహదేవ్ వర్మ (రవితేజ) అనే వ్యక్తి ఒక పత్తి మిల్లు ని నడుపుతూ ఉంటాడు. అతని చుట్టుపక్కన ఏ అన్యాయం జరిగిన సహించడు,అలా తప్పు చేసిన వారిని శిక్షిస్తూ ఆపదలో ఉన్నవారికి సహాయం అందిస్తూ ఉంటాడు. ఆయన చేసే ప్రతీ చర్య, నడుచుకునే నడవడిక మొత్తం చూస్తే అతని వెనుక ఎదో మిస్టరీ దాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక జర్నలిస్ట్(అనుపమ పరమేశ్వరన్) వర్మ లో దాగి ఉన్న ఆ మిస్టరీ కోణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
ఆ క్రమం లో వర్మ ఒక హంతకుడు అని, ప్రభుత్వానికి సంబంధించిన ఒక రహస్య స్కీం ప్రభావం అతని పై పడింది అనే విషయం తెలిసినప్పటి నుండి కథలో అనేక ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. సహదేవ్ వర్మ అడవి నుండి బయటకి రాగానే పోలీసులు అరెస్ట్ చెయ్యడానికి కాచుకొని కూర్చొని ఉంటారు. పోలీసులు సహదేవ్ కోసం ఎందుకు అంతలా ఎదురు చూస్తున్నారు. వణుకుపుట్టించే ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి?. ప్రభుత్వం అతని కోసం పదేళ్ల నుండి ఎందుకు అంతలా గాలిస్తుంది అనేది తెలియాలంటే వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. ఆ స్టోరీ లైన్ కి తగ్గట్టుగానే హీరో మిస్టరీ ఏమిటి అని తెలుసుకునే ఉత్సాహం ఆడియన్స్ లో కూడా కలిగేలా చేసాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్ గానే ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం అదరగొట్టేసాడు అనే చెప్పాలి. యాక్షన్ బ్లాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్ లోనే ఉన్నాయి. కథలో కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. కానీ రవితేజ ఆ లూప్ హోల్స్ ని కవర్ చేస్తూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చేసాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో రవితేజ పాత్ర చాలా తక్కువ సేపు కనిపిస్తుంది.
పట్టుమని 30 నిమిషాలు కూడా ఉండదు, కానీ కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. రాసుకున్న డైలాగ్స్ గొప్పగా లేవు. వాయిస్ ఓవర్ మొత్తం చదువుతున్నట్టే ఉంటుంది కానీ, న్యారేటివ్ స్టైల్ లో ఉండదు. ఇవొక్కటే ఈ సినిమాకి మైనస్. మిగతా సినిమా మొత్తం రవితేజ కెరీర్ లో ఒకానొక బెస్ట్ సినిమా గా మిగిలిపోతుంది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చివరి 40 నిమిషాలు అయితే ఆడియన్స్ కి గూస్ బంప్స్ మొమెంట్స్ ని రప్పించింది అనే చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు రవితేజ. ముఖ్యంగా ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతంగా ఉందనే చెప్పాలి. చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా అనుపమ పరమేశ్వరన్ నటన కూడా చాలా బాగుంది. నవదీప్, కావ్య థాపర్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.
ఇక ఈ సినిమాకి డైరెక్షన్ తో పాటుగా సినిమాటోగ్రఫీ కూడా కార్తీక్ ఘట్టమేని చేసాడు. అందువల్ల ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్ గా, లావిష్ గా కనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జంద్ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించి ఎలివేట్ చేసాడు.
చివరి మాట :
చాలా కాలం తర్వాత రవితేజ నుండి వచ్చిన పవర్ ఫుల్ కంటెంట్ సినిమా..బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
రేటింగ్ : 3 /5