Eagle Day-2 Collections : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ఈగల్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత రవితేజ నుండి విడుదలైన ఈ చిత్రం అభిమానులకు కాస్త ఉపశమనం కలిగించింది. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన ముందు రోజు సీఎం జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ విడుదలైంది.
కాబట్టి తక్కువ థియేటర్స్ ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలలో ‘ఈగల్’ కి థియేటర్స్ కరువు అయ్యాయి . అందుకే ఆశించిన స్థాయి ఓపెనింగ్ రాలేదు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది రాసితేజ గత చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’ కంటే తక్కువ అనే చెప్పాలి.
మొదటి రోజు ఓపెనింగ్ అంతంత మాత్రం గానే ఉండగా, రెండవ రోజు కూడా అనుకున్న రేంజ్ వసూళ్లు రాలేదు. కేవలం సిటీస్ లో తప్ప, బీ సి సెంటర్స్ లో మాత్రం అనుకున్న రేంజ్ పెర్ఫార్మన్స్ లేదు. కారణం రవితేజ ఎప్పుడూ ఎంచుకునే మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాకపోవడమే. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ, రెగ్యులర్ రవితేజ మాస్ సినిమా మాత్రం కాదు, అందుకే ఈ సినిమాకి మాస్ సెంటర్స్ లో అనుకున్న స్థాయి వసూళ్లు అందడం లేదు. ఇక ట్రేడ్ అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది డీసెంట్ సాయి వసూళ్లే అయ్యినప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ స్పీడ్ సరిపోదు.
ఈ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లాలంటే పాతిక కోట్ల రూపాయిలు కచ్చితంగా వసూలు చెయ్యాలి. ఇప్పటికైతే కేవలం 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. నేటి తో కలిపి మరో నాలుగు కోట్లు, మొత్తం మీద 3 రోజులకు గాను 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్టు అన్నమాట. పాతిక కోట్ల రావాలంటే కచ్చితంగా పని దినాలలో డీసెంట్ స్థాయి వసూళ్లు రాబట్టాలి. మరి ఈ సినిమా రాబడుతుందో లేదో చూడాలి.