JAISW News Telugu

Hyderabad : హైదరాబాద్ గాలిలో ధూళి కణాలు పెరిగాయి

Hyderabad

Hyderabad

Hyderabad : హైదరాబాద్ పట్టణంలోని గాలిలో సూక్ష్మ ధూళి కణాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పింది. జూపార్క్, బొల్లారం, పాశమైలారం, చార్మినార్, జీడిమెట్ల, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5, పీఎం 10 స్థాయి ధూళి కణాలు ఎక్కువగా ఉన్నట్టు నివేదికలో పేర్కొంది.

గడిచిన నాలుగు నెలలకు సంబంధించిన డేటాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిలీజ్ చేసింది. గాలిలో పీఎం 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు 40 శాతానికి మించరాదు. పీఎం 10 సూక్ష్మ ధూళి కణాలు వంద శాతానికి మించరాదు. కానీ.. పట్టణంలోని చాలా జంక్షన్లలో సాధారణం కంటే ఎక్కువ ధూళి కణాలు నమోదవుతన్నట్లు రిపోర్టులో వెల్లడైంది. పరిస్థితి ఇలాగే ఉంటే పట్ణణవాసులు శ్వాస, గుండె సంబంధిత, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడతారని బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు.

సనత్ నగర్ లో అత్యధికంగా 66 శాతం నమోదైంది. బొల్లారంలో 65 శాతం, పాశమైలారంలో 63 శాతం, జూపార్క్ ఏరియాల్లో 55 శాతం రికార్డవుతున్నాయి. ఇక పీఎం 10 అంటే 10 మిల్లీ మైక్రాన్ల పరిమాణం ఉన్న ప్రమాదకరమైన దుమ్మూ, ధూళి కణాలు ఇందులో వస్తాయి. పీఎం 10 కంటే పీఎం 2.5 ఎక్కువ ప్రమాదకరం. పీఎం 10 స్థాయి సూక్ష్మ ధూళి కణాలు వంద శాతానికి మించి ఉండొద్దు. కానీ, జూపార్క్ ఏరియాాలో అత్యధికంగా 143 శాతవం నమోదైంది. బొల్లారంలో 111 శాతం, పాశమైలారంలో 112 శాతం, జీడిమెట్లలో 111 శాతం, చార్మినార్ ఏరియాలో 111 శాతం నమోదయ్యాయి.

Exit mobile version