Sri Mahalakshmi Devi : శ్రీమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
Sri Mahalakshmi Devi : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి దర్శించుకుంటున్నారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. దుర్గాసప్తశతి అంతర్గతమైన దేవీ చరిత్రలో ఆదిపరాశకి్త మహాకాళీ, మహాలక్ష్మీ మహా సరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్టరాక్షస సంహారాన్ని చేసిందని చెప్పబడింది. ఈ మూడు శక్తుల్లో ఒక శక్తిన ఈ మహాలక్ష్మీ, అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడనే అసురుణ్ణి సునాయాసంగా సంహరించి మహిషమర్ధినిగా ప్రసిద్ధి పొందింది. ఆ తరువాత మహిషమర్ధినీదేవి స్వరూపంతోనే ఈ ఇంద్రకీలాద్రి మీద వెలిసిందని ప్రతీతి.