Dunki Vs Salaar:సలార్ ఓపెనింగ్స్‌పై షారుక్ డంకీ పంచ్!
Dunki Vs Salaar:ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ – కేజీఎఫ్ 2 సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల కంటే సలార్ స్కేల్ పరంగా ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుందని తాజాగా ఈ సినిమాకి పని చేసిన సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలోనే మరో రామోజీ ఫిల్మ్ సిటీని సృష్టించామని భువన్ గౌడ పేర్కొన్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమా కోసం కెజిఎఫ్ సెట్స్‌ని వాడుతున్నారనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు.
కళాదర్శకుడు శివకుమార్ 100 ఎకరాల్లో భారీ సెట్స్ వేశారు. సాంకేతికంగా మేం వేరే లెవల్. దేశంలో సినిమా కోసం వేసిన అతిభారీ సెట్లలో ఇది ఒకటి అని వెల్లడించారు. కేజీఎఫ్ కంటే స్కేల్ పరంగా ఐదు రెట్లు పెద్ద చిత్రం సలార్ అని వెల్లడించారు. నిజానికి సలార్ ప్రారంభించే సమయంలోనే ప్రశాంత్ నీల్ ఈ విషయాన్ని ఛూచాయగా వెల్లడించారు. కేజీఎఫ్ కంటే అత్యంత భారీ యాక్షన్ ని సలార్ లో ఆవిష్కరిస్తున్నామని ప్రశాంత్ నీల్ తెలిపారు.
దానికి తగ్గట్టే ఇందులో ప్రభాస్ ని బీస్ట్ రూపంలో భారీ యాక్షన్ హీరోగా ఆవిష్కరించారని ట్రైలర్ వెల్లడించింది. ట్రైలర్ లో ప్రభాస్ ని చివరి సెకనులో చూపించినా కానీ అతడి పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయో ఆవిష్కరించిన తీరు గూస్ బంప్స్ తెచ్చింది. ఇప్పుడు టీమ్ కీలక సభ్యుడు భువనగౌడ ఇచ్చిన క్లారిటీతో సలార్ పై మరింతగా అంచనాలు పెరిగాయి. మరో ఏడెనిమిది రోజుల్లో విడుదలకు వస్తున్న సలార్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు.
సలార్ ఓపెనింగుల రికార్డులు సాధిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం షారూఖ్ ఖాన్ డంకీ.. హాలీవుడ్ మూవీ ఆక్వామేన్ తో పోటీపడాల్సి ఉంటుంది. ఖాన్ సినిమా కోసం ఉత్తరాదిన భారీగా థియేటర్లను లాక్ చేసారు. ఇక సలార్ కి తడానీల అండదండలు నార్త్ లో ఉన్నాయి. దీంతో 38శాతానికి తగ్గకుండా థియేటర్లు డంకీ కోసం లాక్ చేస్తున్నారని తెలిసింది. భారీ హాలీవుడ్ చిత్రం ఆక్వామేన్ కి చెప్పుకోదగ్గ థియేటర్లు కేటాయిస్తున్నారు. దీంతో సలార్ ఓపెనింగులు ఆశించిన దానికంటే తగ్గొచ్చని భావిస్తున్నారు.