Bandarulanka : డంపింగ్ యార్డును తొలగించాలి.. బండారులంకలో గ్రామస్థుల ఆందోళన
Bandarulanka : అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇళ్ల మధ్య డంపింగ్ యార్డును తొలగించాలంటూ గ్రామస్థులు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిలో భారీగా మోహరించారు. తమ ఇళ్ల మధ్య చెత్త వేయవద్దంటూ చెత్త ట్రాక్టర్లను గ్రామస్థులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ పైనుంచి ట్రాక్టర్లను ఎక్కించండి అంటూ మహిళలు వాహనాలకు అడ్డుగా నిలిచారు. డంపింగ్ యార్డు కారణంగా అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.