World Weed Day : ఏపీలో గంజాయి అనే మాట వినపడని రోజు ఉండదు కాబోలు. దేశంలోనే గంజాయి రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన పాపం సీఎం జగన్ దే. గంజాయి, ఇతర డ్రగ్స్ కు ఏపీని ఎగుమతి దారు, దిగుమతి దారుగా మార్చి రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారు. పాలకులు తమ అక్రమ సంపాదన కోసం గంజాయి వ్యాపారాన్ని వాడుకుంటున్నారు. ‘‘దమ్ మారో దమ్’’ అంటూ గంజాయి మత్తులో యువత చిత్తవుతున్న పట్టించుకునే వారే లేరు.
ఏప్రిల్ 20న గంజాయి దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్నే సాధారణంగా 420 అని కూడా పిలుస్తారు. గంజాయిని ఎన్నో రకాలుగా పిలుస్తారు. గంజాయి, మేరిజెన్, గంజా, పాట్.. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. గంజాయి మొక్క డెల్టా-9- టెట్రా హైడ్రోకాన్నబినాల్ మరియు కన్నాబిడియోల్ అని పిలువబడే రసాయనాలు కలిగి ఉంటుంది. గంజాయిని సేవించిన వారికి నిషా నషాలనికి అంటి అద్భత భ్రమలోకి వెళ్తాడు. అది వారికి అమితానందాన్ని కలుగజేస్తుంది. దానికి బానిసగా మారి జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తుంది.
గంజాయిని వాడితే కలిగే అనర్థాలపై యువతకు అవగాహన పరచాలి. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీలు, దేశీయ విద్యా సంస్థల్లో చదవే విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నారు. అలాగే మహా నగరాల్లో ఉండే యువతకు పబ్ ల్లో విరివిగా లభిస్తోంది. గంజాయి వాడకంపై, గంజాయి అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపితేనే దాన్ని అరికట్టవచ్చు. గంజాయి బారిన పడిన బాధితులను డీ అడిక్షన్ సెంటర్ లో చేర్పించడమే కాదు వారికి అండగా ఉండాలి. గంజాయి వల్ల వచ్చే దుష్ఫలితాలను వారికి చెప్పి వారిని చైతన్య పరచాలి. గంజాయి అంటే ఆనందం కాదని.. ప్రాణాలు తీసే హంతకి అని సమాజంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ముఖ్యంగా గంజాయి వ్యాపారాన్ని అరికడితే దాన్ని వాడేవారికి దొరక్కుండా చేయవచ్చు. గంజాయి వ్యాపారం చేసినా, గంజాయిని సేవించినా కఠిన శిక్షలు అమలు చేయాలి. అప్పుడే గంజాయిని తీసుకునేందుకు వెనకాడతారు.