Rajanna Sircilla : పీకల దాక తాగి.. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా..
Rajanna Sircilla : పీకల దాక తాగిన తర్వాత ఏం చేస్తున్నారో అర్థం కాదు. తాగుబోతుల ఆగడాలు ఈమధ్య మరి ఎక్కువవుతున్నాయి. వైన్స్ షాపులు, బార్ షాపుల్లో, వాటి పరిసరాల్లో వీరి ఆగడాలను తట్టుకోలేకపోతున్నాం. తాగిన మత్తులో ఏం చేస్తున్నాం..ఎక్కడున్నాం..ఎలా ఉన్నామనే సోయి లేకుండా ఇష్టం వచ్చిన చేష్టలు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణం పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి 1.30కు ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి హల్ చల్ చేశాడు. స్టేషన్ గేట్ ముందు నడిరోడ్డుపై నగ్నంగా హంగామా చేశాడు. అడ్డుకున్న పోలీసులపైకి ఎగురబోయాడు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనీరు గ్రామానికి చెందిన జైపాల్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సు నుంచి సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందు దిగాడు. స్టేషన్ లో నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసుల వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీస్ స్టేషన్ గేట్ ముందు బట్టలిప్పి రోడ్డుపై నగ్నంగా, ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు.
జైపాల్ ను సముదాయించేందుకు పోలీసులు దాదాపు రెండున్నర గంటల పాటు ప్రయత్నించిన వినకపోవడంతో జైపాల్ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం జైపాల్ కు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.