Actress Hema : డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.. ‘మా’ సభ్యత్వం ఇవ్వండి: సినీనటి హేమ
Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసులో సినీనటి హేమ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ సభ్యత్వం రద్దు చేశారు. లేటెస్ట్ గా డ్రగ్స్ టెస్టులో ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని హేమ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘మా’ సభ్యత్వం మళ్లీ తిరిగి ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి హేమ విన్నవించారు.
షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని, వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం తిరిగి ఇవ్వాలని హేమ కోరారు. ఈ మేరకు మంచు విష్ణును కలిసి వినతిపత్రం ఇచ్చారామె. మిగతా ఆర్టిస్టులు, అసోసియేషన్ సభ్యులు తనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.