Dropout student : కోటి విద్యలు కూటి కోసమే కదా.. ఈ సత్యం తెలుసుకున్నాడు ఒక యువకుడు. కూటి కోసమే కోటి విద్యలైనప్పుడు విద్యను పక్కన పెట్టి కూడు కోసం పాకులాడడం మంచిది అనుకున్నాడు. చదువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడ చదువును మధ్యలో ఆపి బిజినెస్ స్ట్రార్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్నాడు. నెల్లూరుకు చెందిన సంజిత్ ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో తన బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి, వైట్ కాలర్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నాడు. ఖాళీగా ఉండేందుకు ఇష్టం లేక ‘డ్రాపౌట్ చాయ్ వాలా’ అనే పేరుతో మెల్‌బోర్న్ లోని రద్దీగా ఉండే సీబీడీ (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్) ఏరియాలో కాఫీ షాపు ఏర్పాటు చేశాడు. తన తొలి స్టార్టప్ వెంచర్ తో వ్యాపారం పెంచుకుంటూ ఇప్పుడు ఏడాదికి రూ. 5 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ‘బీబీఏ చదివేందుకు వచ్చిన నేను చదువులో వెనుకబడడంతో పాటు ఫెయిల్ కావడంతో డ్రాపౌట్ అయ్యాను. ఏం చేయాలో తెలియక టీ షాపు పెట్టాను. నాకు బాల్యం నుంచి టీ చేయడం, తాగడం ఇష్టం కాబట్టి ఇందులో సక్సెస్ అయ్యాను’ అని తన స్టోరీ చెప్పుకున్నాడు.