Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్
Srikalahasti Temple : శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై (Srikalahasti Temple) డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. కొందరు వ్యక్తులు డ్రోన్ సహాయంలో ఆలయానికి సంబంధించి వీడియోలు చిత్రీకరించి నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో తమిళనాడు చెందిన ఐదుగురు యువకులు వీడియోల చిత్రీకరించినట్టు గుర్తించారు.
శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ.. డ్రోన్ ఎగరవే స్తున్న వాళ్ళని గుర్తించి పోలీసులకు అప్పగించిం ది. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్, కన్నన్, శంకర్ శర్మ, అరవింద్‌లను పోలీసులు అదు పులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆలయంపై డ్రోన్ ఎగరడంపై భక్తులు ఆందోళన చెందారు.