President Donald Trump : ట్రంప్ ముందర జైశంకర్ కు మొదటి సీటు.. భారత్ కు దక్కిన అరుదైన గౌరవం

President Donald Trump : అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ రొటుండాలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి డా. జైశంకర్ సముచిత గౌరవం దక్కింది. ఆయనను ట్రంప్ ముందు వరుసలో కూర్చుండ బెట్టడం విశేషం. భారత్ కు ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడం.. ముందు వరుసలో జైశంకర్ సీటు కేటాయించడంతో ట్రంప్ పరిపాలనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండాలనే లక్ష్యంతో భారతదేశానికి స్పష్టమైన సందేశంగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అర్థమవుతోంది.

అనంతరం డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. COVID-19 మహమ్మారి, ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభాలను ఏజెన్సీ తప్పుగా నిర్వహించడాన్ని ఉటంకిస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా నిష్క్రమిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థల పాత్ర, జవాబుదారీతనం గురించి ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.

జనవరి 6, 2021, US కాపిటల్ దాడిలో అభియోగాలు మోపబడిన సుమారు 1,500 మంది తన మద్దతుదారులకు క్షమాభిక్ష ఇస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు, తన మొదటి రోజున తన భారీ క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించి, న్యాయవ్యవస్థలోనే అతిపెద్ద దర్యాప్తు , ప్రాసిక్యూషన్‌ను ట్రంప్ ఆపేసి చరిత్ర సృష్టించారు.

TAGS