2024 US elections Result : 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్.. డా.జై గారు చెప్పిన జోస్యం నిజమైంది
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తాజా ట్రెండ్స్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ 270 ఎలక్టోరల్ ఓట్లతో, కమలా హారిస్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ప్రెసిడెంట్ కావాలంటే 270 ఓట్లు అవసరం. మెజారిటీ మార్కును డోనాల్డ్ ట్రంప్ అందుకున్నారు .
ట్రెండ్స్‌లో, ట్రంప్ హయాంలో అమెరికా ఇప్పుడు నీలం నుండి ఎరుపు రంగులోకి మారుతున్నట్లు కనిపిస్తోంది. టెక్సాస్‌లో తన కోటను కాపాడుకున్న ట్రంప్‌కు 40 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఒహియోలో కూడా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇక్కడ 17 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ అంచనాల ప్రకారం, ఎన్నికల్లో ట్రంప్ గెలవగలరని 87 శాతం అంచనా వేశారు.
ముందు చెప్పిన డాక్టర్ జై బాబు
ప్రపంచ దేశాలు ఈ సారి అమెరికా ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ ఎన్నికలపై ఎన్నో కథనాలను వెలువరించాయి. యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి అమెరిక అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతున్నదో ముందే అంచనా వేశారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. చాలా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించాయి.
పెద్ద పెద్ద సర్వే సంస్థలకన్నా భిన్నంగా ఈసారి యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరో కచ్చితంగా అంచనా వేయడం విశేషం.