JAISW News Telugu

Dr. Jai Yalamanchili : 6 నెలల ముందే జగన్ ఓటమిని చెప్పిన డా. జై యలమంచిలి

Dr. Jai Yalamanchili

Dr. Jai Yalamanchili

Dr. Jai Yalamanchili : ఏపీలో కూటమి దూకుడు ముందు వైసీపీ పూర్తిగా చేతులేత్తిసింది. గతంలో ఎన్నడూ లేని ఘన విజయాన్ని టీడీపీ అందుకుంది. జనసేన, బీజేపీ తోడు రాగా పసుపు దళం ప్రత్యర్థి పార్టీని పాతాళంలోకి తొక్కేసింది. సైకిల్ స్పీడ్ కు ఫ్యాన్ రెక్కలు విరిగిపడి తుక్కుతుక్కు అయిపోయింది. టీడీపీ కూటమి ప్రభంజన హోరును గురించి ఎంత చెప్పినా తక్కువే. చంద్రబాబు చాణక్యం, పవన్ దూకుడుతో ఎవడ్రా మమ్మల్ని ఆపేది అన్నట్టుగా కూటమి సునామీ విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ ఘన విజయం కోసం చంద్రబాబు అభిమానులు ఐదేండ్లుగా ఎదురు చూశారు. జగన్ అండ్ కో తమ నేతలు చంద్రబాబు, లోకేశ్ లను అవమానిస్తుంటే భరిస్తూ వచ్చారు. ఏదో ఒక రోజు గట్టిగా కొడుతామని నమ్మారు. అదే నేడు నిజమైంది. అమరావతి వీధుల్లో పసుపు జెండా రెపరెపలాడుతోంది.
టీడీపీ ఘన విజయంలో ఆ పార్టీకి చెందిన నేతలు, నాయకులు, కార్యకర్తలు..ఇలా అందరి విశేష కృషి వచ్చింది. ఈ ఘన విజయం కోసం ఐదేండ్లుగా ఎంతో కృషి చేశారు. అందులో ఎన్ ఆర్ఐల పాత్ర వెలకట్టలేనిది. ముఖ్యంగా యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి గారి అహర్నిషలు టీడీపీ ఘన విజయం కోసం పనిచేశారు. ఎంతో పని ఒత్తిడి ఉన్నా అమెరికాలో సైతం చంద్రబాబు నాయుడిని మరోసారి సీఎం చేయడం కోసం ఎంతగానో తపించారు. ఆరు నెలల కింద చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ వద్ద యూబ్లడ్ ఫౌండర్ నేతృత్వంలో ‘‘ఐయామ్ విత్ సీబీఎన్’’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి వందలాది ఎన్ఆర్ ఐ టీడీపీ అభిమానులు హాజరయ్యారు. జై టీడీపీ, జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.

 అనాటి ప్రసంగంలో యూబ్లడ్ ఫౌండర్ జై జగదీశ్ బాబు యలమంచిలి టీడీపీ అభిమానుల్లో జోష్ నింపడమే కాదు జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘చంద్రబాబును నువ్వు పెత్తందారి అంటావా..నువ్వా పెత్తందారివి వీళ్లా జగన్.. నీకు కూర్చుంటే లక్ష కోట్లు ఎలా వచ్చాయి..కంపెనీలు పెట్టడానికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి.. నీ తాత ఎక్కడి నుంచి వచ్చాడు..’’ అంటూ విరుచుకుపడ్డారు. యుద్ధం మొదలైంది.. సైకోను పీకేద్దాం అంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారు అని చెప్పారు.

 ఇంకా డాక్టర్ జగదీశ్ బాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుంది..జగన్ సృష్టించిన సంక్షోభం నుంచి రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం. హైదరాబాద్ లో సంపదను సృష్టించిన హిస్టరీ చంద్రబాబు గారికి ఉంది.. అలాగే సంక్షేమంలోనూ  ఎన్టీఆర్ కు వారసుడిగా హిస్టరీ సృష్టించిన ఘనత చంద్రబాబు గారిదే. ఇక టీడీపీతో కలిసి రావడానికి జనసేనాని పవన్ కల్యాణ్ వస్తున్నారు..సైకోను తరిమికొడుతాం..అలాగే సైకోలు అంతా జాగ్రత్తగా ఉండాలి.. జగన్ నువ్వు ఓడిపోతున్నావ్..ఈసారి ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం పక్కా..భూస్థాపితం అయిపోతావ్ జగన్ అంటూ ఆయన హెచ్చరించారు.

కాగా, 6 నెలల కింద యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీశ్ బాబు గారు చెప్పినట్టుగా నేటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ దుమ్మురేపడమే కాదు సైకో జగన్ పార్టీ అధ:పాతాళంలోకి వెళ్లిపోయింది. చంద్రబాబు గెలపు మాములుగా లేదు.. నాలుగో సారి సీఎంగా రికార్డులు సృష్టించడమే కాదు జాతీయ రాజకీయాల్లో మరోసారి ఆయన  కీలకం అవుతున్నారు. అనాడు న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ వద్ద జై జగదీశ్ బాబు గారు చెప్పిన ప్రతీ మాట ఇప్పుడు నిజం కావడంతో ఆయన్ను ఎన్ఆర్ఐలు, ఆయన ఫాలోవర్స్ , టీడీపీ అభిమానులు ఎంతో మంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Exit mobile version