Dr. Jai Garu : ప్రముఖ పారిశ్రామిక వేత్త డా. జై యలమంచిలి స్థాపించిన ‘యూ బ్లడ్ (నోబుల్ టూ సేవ్ లైఫ్)’ను కొత్త నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ఒకరి రక్తం మరొకరికి ప్రాణం’ అంటూ ఆయన స్థాపించిన ఈ సంస్థ ద్వారా వేలాది కుటుంబాలు నేడు ధీమాగా ఉన్నాయి. యూ బ్లడ్ ను స్థాపించినప్పటి నుంచి తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది నుంచి సేకరించిన బ్లడ్ ను కష్టాల్లో ఉన్న వారికి అందజేసి ప్రాణాలను కాపాడుతున్నారు జై యలమంచిలి గారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త యూబ్లడ్ సృష్టికర్త జగదీశ్ యలమంచిలిని డాక్టరేట్ వరించింది. ఈ డాక్టరేట్ కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న పలువురు ప్రముఖులను పరిశీలించిన ‘‘The Global Human Peace University ” మొత్తానికి దేశ వ్యాప్తంగా 10 మందిని ఎంపిక చేయగా అందులో జై యలమంచిలికి చోటు దక్కడం విశేషం. యూబ్లడ్ యాప్ ని సృష్టించి తద్వారా రక్తదానం గురించి అలాగే రక్తగ్రహీతల గురించి సమగ్ర సమాచారం ఉండేలా ఒకే యాప్ ను సృష్టించి రక్తదానం గొప్పతనాన్ని , అవసరాన్ని చాటిచెప్పిన వ్యక్తి , శక్తి కావడంతో జై యలమంచిని డాక్టరేట్ అవార్డుతో సత్కరించింది ది గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ .
చెన్నై లోని యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ అవార్డు ఫంక్షన్ జరిగింది. 2022 నవంబర్ 26 న జరిగిన కార్యక్రమంలో జై యలమంచిలి అలియాస్ జగదీశ్ యలమంచిలిని డాక్టరేట్ అవార్డుతో సత్కరించారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆ నాటి జ్ణాపకాలను మరో సారి తన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. UBlood app కు ప్రముఖ నటులు సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. JSW & Jaiswaraajya.tv వంటి సంస్థలకు అడ్వైజర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ జగదీశ్ యలమంచిలి. పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.