JAISW News Telugu

UBlood App : యూ బ్లడ్ యాప్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి

UBlood App

UBlood App Founder Dr. Jai Yalamanchili

UBlood App : ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా జబర్దస్త్ కమెడియన్ రాజమౌళి రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి ఏర్పాటు చేసిన యూ బ్లడ్ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతో మందికి రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఒకరి రక్తం ఒకరి ప్రాణమని అన్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. గర్భిణీ స్త్రీలు, తలసేమియా వ్యాధిగ్రస్తులు, రోడ్డు యాక్సిడెంట్లలో గాయాలపాలైన ఎంతో మంది అభాగ్యులను కాపాడడంలో దేశ వ్యాప్తంగా యూ బ్లడ్ చేసిన కృషి మరిచిపోలేదన్నారు.

యూ బ్లడ్ యాప్ వ్యవస్థాపకులు డాక్టర్ జై జగదీశ్ యలమంచిలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజమౌలి అన్నారు. ఆయన ఈ యాప్ ద్వారా ఇప్పటికే దేశంలో ఎన్నో వేల మందికి రక్తం అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారని కొనియాడారు. యలమంచిలి వారి సేవా గుణంతో చాలా మంది ప్రాణాలు రక్షించబడ్డాయని అన్నారు. యూ బ్లడ్ సహకారంలో హన్మకొండలో చిలువేరి శంకర్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా.. మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు.

డాక్టర్ యలమంచిలి, చిలువేరి శంకర్ ల ప్రయత్నం చాలా గొప్పదని ప్రశంసించారు. యూ బ్లడ్ యాప్ ద్వారా రక్తం దానం చేసి ప్రాణ దాతలు కావాలని కోరారు. రక్తదాతలకు, రక్తదానం చేసిన యువతీ యువకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి సేవ కార్యక్రమాలతో ప్రజల మనసులో డాక్టర్ యలమంచలి ఎప్పటికీ ఉండిపోతారన్నారు.

యూ బ్లడ్ యాప్ ను ఫాలో కావాలని అందరూ రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు.. యూ బ్లడ్ ద్వారా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కాపాడారని, ఈ యాప్ విశిష్టతను ఎంతో మందికి తెలియజేయాలని కోరారు. డాక్టర్ యలమంచిలి, చిలువేరి శంకర్ ల సేవలను గుర్తించుకుని ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తూ సేవ చేయాలని కోరారు. 

Exit mobile version